ఆగస్టు 16..వరలక్ష్మీ వ్రతం.. శుభమూహూర్తం ఇదే..

వరలక్ష్మి వ్రతం దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్దలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం. మహిళలు దీర్ఘాయుస్సు కోసం, సంతానం ఉజ్వల భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిది కంటే ముందు వచ్చే శుక్రవారం( ఆగస్ట్ 16 ) రోజున వరలక్ష్మీ వ్రతాన్ని పాటిస్తారు. శ్రావణమాసం  సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనప్పటికీ.. లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రవణ మాసం శుక్రవారం చాలా ముఖ్యమైనదని నమ్మకం. అందుకే వరలక్ష్మీ వ్రతానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది.

వరలక్ష్మి వ్రతం దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్దలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం. మహిళలు దీర్ఘాయుస్సు కోసం, సంతానం ఉజ్వల భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు.


వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమి తిధి కి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్ట్ 16 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.

  • వరలక్ష్మీ వ్రతం 2024 శుభ ముహూర్తం (వరలక్ష్మీ వ్రతం 2024 శుభ ముహూర్తం) సింహ లగ్న పూజ ముహూర్తం (ఉదయం) – 05:57 am – 08:14 am (వ్యవధి – 2 గంటల 17 నిమిషాలు)
  • వృశ్చిక రాశి పూజ ముహూర్తం (మధ్యాహ్నం) – 12:50 PM – 03:08 PM (వ్యవధి – 2 గంటల 19 నిమిషాలు)
  • కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం) – 06:55 PM – 08:22 PM (వ్యవధి – 1 గంట 27 నిమిషాలు)
  • వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి) – 11:22 pm – 01:18 pm, ఆగస్టు 17 (వ్యవధి – 1 గంట 56 నిమిషాలు)

వరలక్ష్మీ వ్రతం పూజ విధి

వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి దినచర్య ముగించుకుని ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. ఇంటి ముంగిట రంగ వల్లుల్లు తీర్చిదిద్దాలి. అనంతరం ఇంట్లోని పూజా గదిని, వ్రతం చేసుకునే పూజా స్థలాన్ని శుభ్రం చేసి.. ఆ స్థలంలో గంగాజలాన్ని చల్లి శుద్ధి చేయండి. ఇప్పుడు తల్లి వరలక్ష్మి దేవిని స్మరిస్తూ ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. తరువాత ఒక చెక్క పీటను తీసుకుని దానిపై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి లక్ష్మీదేవి, గణపతిల విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించండి. లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ప్రతిష్టించండి.

దీని తరువాత గణేశుడు లక్ష్మి విగ్రహాల ముందు నెయ్యితో దీపారధన చేయండి. అగరబత్తిలను వెలిగించి.. గణపతికి ముందుగా పూజ చేయండి.. పూలు, దర్భ, కొబ్బరికాయ, చందనం, పసుపు, కుంకుమ, అక్షత, పూలమాల మొదలైన వాటిని సమర్పించండి. దీని తరువాత వరలక్ష్మీ దేవి పూజను చేయండి. అమ్మవారికి పదహారు అలంకారాలతో పాటు పసుపు, కుంకుమ, అక్షతలు, పూలమాల సమర్పించండి. అనంతరం అమ్మవారికి పులిహోరం, పాయసం, శనగలు, చలిమిడి, వడపప్పు, బూరెలు వంటి ఆహారపదార్ధాలను తొమ్మిది రకాలు, లేదా ఐదు రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించండి. తరువాత అమ్మవారి అష్టోత్తరశతనామావళి మంత్రాలతో పూజ మొదలు పెట్టండి. పూజ సమయంలో వరలక్ష్మీ వ్రత కథను పఠించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించి, ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. ముత్తైదువులకు పసుపు కుంకుమ శనగలుమ తాంబూలం పెట్టి వాయినం అందించండి.

వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే

  • సంపద:శ్రేయస్సు: ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి.
  • ఆనందం: శాంతి: ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుందని, కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు.
  • అఖండ సౌభాగ్యం కోసం: వివాహిత స్త్రీలకు ఈ ఉపవాసం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు.
  • సంతానం ఆనందానికి: పిల్లలు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు. సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
  • పేదరికం దూరమవుతుంది: వరలక్ష్మీ వ్రతం ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా కాలం ఆనందంగా జీవిస్తారని నమ్మకం.