కోనసీమ తిరుమలగా .... అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడువారాల స్వామిగా ప్రసిద్ధి. ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేయాలి.
కలియుగంలో ఎర్రచందన రూపుడిగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వరస్వామిని (Vadapalli Venkateswara Swamy) ఎందుకు దర్శించాలి..? 1300 కిలోమీటర్లు గోదావరి (Godavari) లో కొట్టుకొచ్చి స్వామి వారు పచ్చనికోనసీమలో 800 సంవత్సరాల కిందట ఎందుకు వెలిశారు..? ఏడువారాలు దర్శిస్తే చాలు సర్వ శుభాలు స్వామి ఎలా ప్రసాదిస్తారు..? ఇతర దేశాల నుంచి విమానాల్లో సైతం ఏడు వారాలు వచ్చి స్వామిని దర్శించడం ద్వారా స్వామి అనుగ్రహం ఏం పొందారు. తెలుగు రాష్ట్రాల్లో రెండవ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పై ప్రత్యేక కథనం.
కోనసీమ తిరుమలగా .... అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడువారాల స్వామిగా ప్రసిద్ధి. ఏడు శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ క్రమంలో జిల్లానుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి సైతం భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శనివారం రోజు ఆలయం బాగా రద్దీగా ఉంటుంది. తెల్లవారుజామునుంచి వాడపల్లి వెంకన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు.
కలియుగంలో ఏస్వామిని దర్శిస్తే మనలో బాధలు సమస్యలు వైదోలిగి మనశ్శాంతితో జీవిస్తామోఏస్వామిని దర్శిస్తే సకలశుభాలు మన కుటుంబాలకు చేకూరుతాయో ఏస్వామిని దర్శిస్తే అన్నవస్త్రాలకు లోటు ఉండదో అటువంటిస్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటారు. తిరుపతి క్షేత్రం (Tirupathi Temple) తర్వాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికే చెల్లిందనడంలో ఏమాత్రం సందేహం లేదని పండితులు చెబుతున్నారు. నిత్యం వేలాదిగా భక్తులు ముఖ్యంగాశనివారం పర్వదినం స్వామిని దర్శించాలంటే పెట్టిపుట్టాలి అనే విధంగా అత్యధిక భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి ఏడువారాలు స్వామిని దర్శించి స్వామివారి సేవలో కొనియాడుతూ ఉంటారు. దీంతో పచ్చని కోనసీమ జిల్లా అంతా హరినామంతో మారిపోతూ ఉంటుంది.
కలియుగంలో దాదాపు కొన్నివందల సంవత్సరాల కిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు నారద మహర్షి వంటి ఎర్రచందన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి అనంతరం స్వామివారిని ప్రత్యేక పెట్టెలో పెట్టి ఆగోదావరిలో నిమజ్జనం చేశారట. దాదాపు 1300 కిలోమీటర్లు నీటిలో కొట్టుకుని వచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉందని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడికి కలలో కనిపించి స్వామి చెప్పారట. దీంతో మేలతాళాలతో స్వామివారి ఉన్న ప్రాంతానికి వెళ్లినప్పటికీ తొలిరోజు స్వామివారి విగ్రహం దొరకలేదని రెండవరోజు స్వామివారి విగ్రహం దొరకడంతో దాదాపు 500 సంవత్సరాల కిందట ఈ స్వామివారికి పూజల ప్రారంభించారట.
ఒక అగ్నికులక్షత్రియుడు స్వామివారిని ఒక కోరిక కోరగా స్వామి ఆ కోరిక తీర్చడంతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారట. నాటి నుంచి ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కొలువు తీరారని కోరిన కోరికలు తీరుస్తూ కొంగుబంగారంగా దిన దిన అభివృద్ధి స్వామివారి ఆలయం చెందుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి కాక తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి సైతం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు. చుట్టూ ఎతైన కొండలు పచ్చటి వాతావరణం మధ్యలో స్వామివారి ఆలయం ఒకపక్క ఆహ్లాదం మరోపక్క ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలంతా ఆధ్యాత్మిక ఆనందం చెందుతున్నారు.. స్వామివారి దివ్య వాడపల్లి క్షేత్రం ..
ఎలా వెళ్లాలంటే...
రాజమండ్రి నుంచి ఆత్రేయపురం మీదగా 25 కిలోమీటర్ల దూరంలో మనకి దర్శనం కలుగుతుంది .
కాకినాడ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం రావులపాలెం మీదగా ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.