ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలో తెలుసా..

హిందువులు జరుపుకునే ప్రతి పండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉగాది రోజున (ఏప్రిల్ 9)  ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం. ఉగాది పండక్కి కాలమే దైవం.  కనుక ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని భక్తి శ్రద్దలతో పూజించాలి. శ్రీ మహా విష్ణు, శివుడు లేదా జగన్మాతను ధ్యానించినా శుభ ఫలితాలు కలుగుతాయి.   ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి? వేటిని దానం చేయడం వలన విశిష్ట ఫలితం ఉంటుందో తెలుసా..

అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం. ఉగాది పండక్కి కాలమే దైవం.  కనుక ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని భక్తి శ్రద్దలతో పూజించాలి. శ్రీ మహా విష్ణు, శివుడు లేదా జగన్మాతను ధ్యానించినా శుభ ఫలితాలు కలుగుతాయి.ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం. అందుకనే ఉగాది రోజున తెల్లవారు జామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలను కటాడతారు. ఇంటి ముందు రంగ వల్లితో తీర్చిదిద్దుతారు.

ఉగాది తెలుగు వారు జరుపుకునే పెద్ద పండగల్లో ఒకటి. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది. ఆ రోజు నుంచి తెలుగు క్యాలెండర్ ప్రారంభం అవుతుంది. యు గాది అంటే యుగానికి మొదటి రోజు అని అర్ధం.. ఉగాది పండగ వస్తుందంటే చాలు వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, కోయిల కువకువలు గుర్తుకుస్తాయి. ఈ రోజున చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుందని అందుకనే మంచి పనులు చేయాలనీ పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇష్టదేవతల స్తోత్రాలని పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని   ఇంటిలో కుటుంబ సభ్యులందరికే అందించాలి. ఈ ఉగాది పచ్చడికి వైద్య పరంగా విశిష్టమైన గుణం ఉంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఉగాది రోజున పెద్దలు పంచాంగ శ్రవణాన్ని వినడానికి శ్రద్ధ చూపిస్తారు. రానున్న రోజుల్లో తమ జీవితంలో జరిగే మంచి , చెడుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. తెలుగు సంవత్సరపు మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలని పెద్దలు చెప్పారు. అంతేకాదు ఉగాది రోజున ‘ప్రపాదానం’ అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. 

ALSO READ :- జనసేనకు ఈసీ షాక్... గాజు గ్లాసు గుర్తు లేనట్లేనా...!

వేసవి కాలం ఎండలు మొదలవుతాయి. కనుక బాటసారుల దాహార్తిని నింపడం కోసమే ఈ నియమం పెట్టినట్లు తెలుస్తోంది. సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు మంచి నీరుతో దాహం తీర్చడమే కాదు.. ఉగాది రోజున కొందరు  చెప్పులూ, గొడుగులను కూడా దానం చేస్తారు. ఉగాది తెలుగు వారికీ నూతన సంవత్సర ప్రారంభం దినం కనుక ఈ రోజున కొత్త పనులను చేపట్టమని పెద్దలు సూచిస్తారు.