తులసి మొక్క ఆనందం, శ్రేయస్సు , విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసిని హరిప్రియ అని పిలుస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ప్రతి రోజు తులసి మొక్కను పూజించినా ఈ రోజు ( 2023, డిసెంబర్ 25 సాయంత్రం) ప్రత్యకంగా పూజించాలని పండితులు చెబుతున్నారు.
మాఘ మాసం శుద్ద చతుర్దశి రోజున ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తులసి మొక్కను నాటి పచ్చి పాలు నైవైద్యంగా సమర్పించాడని పద్మపురాణం తెలుపుతుంది. ఆ సమయంలో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు తులసి మొక్కలో అంతర్దానం అయిందని వేదాలు చెబుతున్నాయి. అందుకే తులసి భర్తగా లక్ష్మీదేవి పతి విష్ణుమూర్తి అనికూడా చెబుతుంటారు. డిసెంబర్ 25 తులసి దివస్ రోజున సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత తులసి మొక్కకు షోడశోపచారాలు పూజలు చేసి అమ్మవారిని ఆరాధిస్తే ఇప్పటి వరకున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈరోజు తులసి మొక్కను ఎలా పూజించాలో తెలుసుకుందాం. . . .
తులసి మొక్క లేని హిందువుల ఇళ్లు దాదాపుగా ఉండవు. ఏదేని కారణాల వల్ల మొక్క నిద్రపోతే వెంటనే మరో మొక్కను ప్రతిష్ఠించారు. హిందూమతంలో తులసి చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. తులసి మొక్కను దేవతగా భావించి ప్రతిరోజూ పూజిస్తారు. హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది.
ఈ రోజు మీ ఇంట్లో తులసి మొక్క ఉండే ప్రదేశాన్ని గోమయం.. గో మూత్రంతో శుద్ది చేయాలి. ముగ్గు పెట్టి పూజా సామాగ్రిని ఉంచుకోవాలి. నీరు, పాలు, గంగాజలం. తులసి ఆకులు, పండ్లు, కుంకుమ, పసుపు, అగర్ బత్తీలు, ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. శుభ్రమైన మడి బట్టలు ధరించాలి.
తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అమ్మవారిని ఆవాహన చేయాలి. షోడశ ఉపచార పూజలు నిర్వహించి భక్తిగీతాలు... కీర్తనలు ఆలపించాలి. తులసి మొక్కలో ఉన్న అమ్మవారికి పూల దండలు సమర్పించాలి. "ఓం విష్ణుప్రియాయ నమః" వంటి మంత్రాన్ని జపిస్తూ తులసి మూలాలపై సున్నితంగా నీరు పోయాలి. మీ దగ్గర గంగా జలం ఉంటే ఆ నీటిని కూడా చల్లాలి. ఆ తరువాత "ఓం తులసీ దేవి నమః" అని ను జపిస్తూ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సు , శాంతి కోసం తులసి మాత , విష్ణువు దేవతలను ప్రార్థించండి భజనలు చేయుచూ తులసి మొక్క చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయండి . ఆ తరువాత పచ్చిపాలతో కూడిన మహానైవేద్యం సమర్పించి ఆ తరువాత భోజనం చేయండి. పచ్చిపాలను అమ్మవారికి సమర్పిస్తే దురదృష్టాన్ని దూరం చేస్తుందని భక్తుల విశ్వాసం .