కార్తీక పురాణం: భూలోక వైకుంఠం ఎక్కడుందో తెలుసా..

భూలోక వైకుంఠం ఎక్కడుంది.. దాని విశిష్టత ఏంటి.. దానికి ఆపేరు ఎలా వచ్చింది.. అక్కడ విష్ణుమూర్తిని దర్శిస్తే కలిగే ఫలితాలు ఏమిటి.. కార్తీకపురాణం 23 వ అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  . .

ఒక రోజు నారదుడు .. విష్ణుమూర్తి వద్దకు వచ్చి  భూలోకంలో మానవులు వారు చేసే పాపాల వలన నరక బాధలు అనుభవించుచున్నారు.  వారు పాపాల నుంచి విముక్తి పొందుటకు సూక్ష్మ మార్గము చెప్పవలయునని చెప్పగా అప్పుడు .. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తి నారదుడికి వివరించిన కథ లో నీవడిన ప్రశ్నకు జవాబు కార్తీక పురాణంలోని 23 వ అధ్యాయంలో  కలదని చెప్పుచూ శ్రీరంగ దివ్యక్షేత్రము గురించి వివరించెను... 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే||

ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపవశ్రవస్తవం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతిః ఆన ష్రుణ్వన్నూతిభిః సీదసాదనం
శ్రీ మహాగణాధిపతయే నమ: హరి: ఓం...

శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట

అగస్త్యుడు మరల అత్రి మహర్షి  వద్దకు వచ్చి  ఓ మునిపుంగవా... విజయమును అందుకున్న  పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా .. అప్పుడు అత్రిమహాముని ఈ విధంగా చెప్పిరి.

కు౦భ సంభవా... పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమునకు  అసమాన బలో పేతుడై అగ్ని శేషము,
 శత్రు శేషము ఉండ కూడదని తెలిసి, తన శత్రు రాజులను అందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును ఏలుచుండెను.  తనకు ఉన్న  విష్ణు భక్తి  ప్రభావమువలన గొప్ప పరాక్ర మవంతుడు,పవిత్రుడు, సత్య దీక్షత కలవాడు.. నితాన్న దాత, భక్తి  ప్రియవాది, తేజో వంతుడు, వేద వేదా౦గ వేత్త గా యుండెను. ... మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖ౦డ కీర్తిని ప్రసరింప చేసెను. శత్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరి షడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను.

అతడిప్పుడు విష్ణు భక్తా గ్రే సరుడు,సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను.అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున.. ఏవిధ ముగా శ్రీ హరి ని పూజించిన కృతార్దుడ నగుదునా? అని విచారించుచుండగా ...

ఒకానొక నాడు అకాశ వాణి  పురంజయా...  కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు. నీవు అక్కడికి వెళ్లి  శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీ వీసంసార సాగర మున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను.

అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని, రాజ్య భారమును మంత్రులకు అప్పగించి, కుటుంబ సపరి వారముగా బయలుదేరి మార్గ మధ్యమున ఉన్న పుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు,పుణ్య నదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగమునకు జేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించు చుండగా మధ్యనున్న శ్రీ రంగనాథుని ఆలయమున శేషశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి... 

 దామోద రా...  గోవిందా... గోపాలా...  హరే  కృష్ణా...  వాసుదేవా..
అనంతా... అచ్యుతా.. ముకుందా.. పురాణపురుషా.. హృషి కేశా.. 
ద్రౌపది మాన సంరక్షకా... ధీన జన భక్తపోషా... ప్రహ్లాదవరదా...
 గరుడ ధ్వజా ... క రి వ ర దా... పాహిమాం... పాహమాం...
రక్షమాం రక్షమాం... దాసోహం పర మాత్మ దాసోహం...

అని విష్ణు సోత్త్ర మును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపిన తదుపరి సపరివారముగా అయోధ్య కు బయలు దేరెను. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో , పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

అయోధ్యానగరము దృఢ తార ప్రాకారములు కలిగి... తోరణ యంత్ర ద్వారములు కలిగి.. మనో హర గృహాలతో ..పురాదులచో చతురంగ సైన్య సంయుత మై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరులై ,  రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భంధకులై, నిరంతరము విజయశీలురై,అప్రమత్తు లై యుండిరి. ఆ నగర మందలి అంగ నామణులు ..హంసగ జగామినులూ.. పద్మ పత్రా యత లోచ నులూ.. నై విపుల శోణీత్వము, విశాల కటిత్వము,సూక్ష్మ మద్యత్వము ..  సింహ కుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవంతులనియు ఖ్యాతిని కలిగి యుండిరి.

ఇది కార్తీక మాసే కార్తీక పురాణే ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం...