శ్రావణమాసం: మంగళగౌరీ వ్రతం ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..

హిందూ మతంలో ప్రతి నెలకు ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని నెలలు పూజలకు పత్యేకం అయితే మరికొన్ని నెలలు పూజలతో పాటు వ్రతాలు, శుభకార్యాలకు కూడా ప్రత్యేకం. ఈ ఏడాది శ్రావణమాసం ( ఆగస్టు 5న)  ప్రారంభమైంది. ఈ నెల పూజలు, వ్రతాలతో పాటు ఉత్తరాదివారు శివుడిని పూజిస్తారు.  ఈ నేపధ్యంలో మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం చేస్తారు. అంతేకాదు కొంత మంది శివ భక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పార్వతి దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శివయ్య భార్య గౌరీ దేవిని ఆచారాల ప్రకారం పూజిస్తారు.

మంగళ గౌరీ వ్రతాన్ని   శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం జరుపుకుంటారు. ప్రారంభమైన మరుసటి రోజు అంటే ఆగష్టు 6 న మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. దీని తరువాత, రెండవ మంగళ గౌరీ వ్రతాన్ని ఆగష్టు 13వ తేదీన, మూడవది ఆగష్టు 20, నాల్గవ మరియు చివరి మంగళగౌరీ వ్రతాన్ని ఆగస్టు 27న జరుపుకుంటారు. ఈ మంగళవారం రోజుల్లో పార్వతీ మాతను మహిళలు ప్రత్యేకంగా పుజిస్తారు. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే, పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని విశ్వాసం.

మంగళ గౌరీ పూజా విధానం

  • ముందుగా శ్రావణమాసంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • తర్వాత శుభ్రమైన స్టూల్‌పై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గౌరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి
  • మంగళ గౌరీ దేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించండి.
  • దీని తరువాత మంగళ గౌరీని ధూపం, నైవేద్యం, పండ్లు, పువ్వులు మొదలైన వాటితో పూజించండి.
  • పూజ ముగిసిన తర్వాత గౌరీ దేవి హారతి ఇచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని ప్రార్థించండి.
  • ఈ రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి. పసుపు కుంకుమ, తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

మంగళ గౌరీ వ్రత ప్రాముఖ్యత

మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారమవుతాయి. అదే సమయంలో పెళ్లికాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడి కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ ఏడాది మంగళ గౌరీ వ్రతాన్ని నాలుగు మంగళవారాలు.. నాలుగుసార్లు ఆచరించనున్నారు. అటువంటి పరిస్థితిలో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రత కథను వినాలి లేదా చదవాలి. లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మంగళగౌరీ వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంతేకాదు సంతానం కోసం ఎదురుచూసే దంపతుల కోరిక తీరుతుంది. చెడు దృష్టి లేదా పిల్లలను ప్రతికూల శక్తి నుండి రక్షణ ఉంది.

మంగళ గౌరీ వ్రత కథ

పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మ పాలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సంపదకు కొరత లేదు. సకల గుణములు కలవాడు. అతను లయకారుడైన మహాదేవుని భక్తుడు. తరువాత వ్యాపారి ధర్మపలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయి చాలా ఏళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో వీరిలో ఆందోళన మొదలైంది. వ్యాపారికి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులెవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ధర్మపలుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది. భార్య సలహా ప్రకారం వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్దుడైన పండితుడి వద్దకు వెళ్లి అతనిని కలిశాడు. అప్పుడు ఆ గురువు వ్యాపారి దంపతులకు శివుడిని, పార్వతిని పూజించమని సలహా ఇచ్చారు.

తరువాత వ్యాపారి దంపతులు శివపార్వతులను నియమ నిష్టలతో భక్తీ శ్రద్దలతో పూజించారు. వ్యాపారి భార్య అచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై – వ్యాపారి భార్యతో ఓ దేవీ! నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను! నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది. అప్పుడు ధర్మ పాలుడి భార్యకు తన సంతాన యోగం ఇవ్వమని.. బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంది. దీంతో తల్లి పార్వతిదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తధాస్తు సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించింది. అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు..

పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకు పేరు పెట్టె సమయంలో ఆ శిశివు తక్కువు ఆయుస్సు కలవాడని.. చెప్పాడు. అయితే దీనికి పరిహారంగా జ్యోతిష్యుడు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ కుమారుడిని వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు. జ్యోతిష్యుడు చెప్పినట్లుగా మంగళ గౌరీ వ్రతాన్ని నిమ నిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు వ్యాపార దంపతులు. ఆ యువతి సౌభాగ్య రేఖతో ఈ ధరంపాల్ కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి.. చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు.