కార్తీకమాసం.. దీపారాధాన.. దీపదానం..... ఫలితం ఇదే..

కార్తీకమాసం కొనసాగుతుంది.  శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. హిందువులు  ఆధ్యాత్మికంగా.. అత్యంత పవిత్రంగా భావించే  కార్తీకం మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం గంగానదితో సమానమైన తీర్థం.. సత్యయుగంతో సమానమైన యుగం.. కార్తీకమాసంతో సమానమైన మాసం.. వేదాలతో సమానమైన సమానమైన శాస్త్రం ఏదీ లేదని చెబుతారు.

కార్తీకమాసంలో శివకేశవులను పూజిస్తే మానవులకు ఈతిబాధలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఉపవాసం.. దీపదానం చేస్తే అత్యంత పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.  అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని పర్వదినాల్లో ఉపనవాసం  ఉండాలి.  కనీసం ఏక భుక్తం అయినా పాటించాలి. ఏడేడు జన్మల పాపాలు నశించి.... జీవితం పరిపూర్ణం అయిన తరువాత  కైలాసానికి కాని.. వైకుంఠానికి కాని చేరతారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  శివాలయ దర్శనం... లింగార్చన.. బిల్వార్చన చేస్తే విశేష ఫలితాలు వస్తాయి.   
కార్తీకమాసంలో  ఆలయాల్లో కాని రావి చెట్టు మొదట్లో దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుందని  శాస్త్రాలు చెబుతున్నాయి.   సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే వేల గోవుల దాన ఫలితం, నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం లభిస్తాయి. కార్తీక మాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి.

ALSO READ : ఆధ్యాత్మికం: కోరికలు తీరాలంటే ఏంచేయాలి...

కార్తీక పురాణ పఠనము ఎంతో ప్రసిద్ధి చెందినది. కార్తీక మాసం నెల రోజులు రోజుకు ఒక అధ్యాయము పఠించి, దానిలోని ఆంతర్యమును గ్రహించి, ఆచరించినవారి జన్మ ధన్య త చెందుతుంది. ఈ పురాణ పఠనములో మనకు ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి. దీప దాన మహాత్మ్యము, దీప ప్రజ్వల విధివిధానములు, వనభోజన ప్రాశస్త్యము, అర్చన, విధి విధానములు, ఎందరో భక్తుల జీవిత గాథలు, నదీస్నాన విశేషములు మున్నగునవి మాన వులకు మార్గనిర్దేశము చేస్తాయి.