భీష్మాష్టమి….హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షం అష్టమి తిథి రోజున తన శరీరాన్ని వదిలి వెళ్లాడు. అందుకే ఈ రోజును భీష్మ పితామహుడు మోక్షం పొందినట్లుగా పండితులు చెబుతుంటారు. అందుకే ఆ రోజును భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ భీష్మాష్టమిని జరుపుకుంటారు. ఆ రోజున భీష్ముడికి తర్పనం సమర్పించినవారికి సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు.
భీష్మాష్టమి ఎప్పుడు వస్తుంది?
ప్రతి సంవత్సరం రథ సప్తమి మరుసటి రోజున భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది. భీష్మాష్టమి ( ఫిబ్రవరి 17) రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. దీనినే భీష్మ తర్పణం అని కూడా అంటారు. అయితే ఈ సంవత్సరం రథ సప్తమి మరియు భీష్మ అష్టమి ఒకే రోజు రావటం గమనార్హం. అయితే పంచాంగం ప్రకారం, 2024 సంవత్సరంలో భీష్మాష్టమి పండుగ శుక్రవారం, 16 ఫిబ్రవరి. అష్టమి తిథి ఫిబ్రవరి 16, శుక్రవారం ఉదయం 8:54 గంటలకు ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి 17 శనివారం ఉదయం 8:15 గంటలకు ముగుస్తుంది.
కాగా భీష్మ తర్పణం విషయంలో ఆ పద్దతి మాత్రం అస్సలు పట్టించుకోరు…పాటించరు కూడా. అంతటి గొప్ప ప్రాధాన్యత భీష్ముడికి ఉంది. భీష్మ పితామహుడు గొప్ప యోధుడు. మహాభారతంలో భీష్ముని పాత్ర చారిత్రాత్మకంగా కూడా చాలా ప్రసిద్ది చెందింది. రాబోయే తరాలు కూడా భీష్ముని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
భీష్మాష్టమి రోజున ఏం చేయాలి…
ప్రతి ఏడాది రథ సప్తమి తర్వాత భీష్మ అష్టమి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు కూడా మూడు దోసిళ్ల అర్ఝ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియను భీష్మ తర్ఫనం అని అంటుంటారు. ధర్మశాస్త్రం ప్రకారంగా భీష్మ తర్పణం, యమ తర్పణం, వంటివి తండ్రి బతికి ఉన్నవారు కూడా తప్పకుండా చేయాల్సిందే. ఇలా చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
పూజ అనంతరం….
భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తికి పూజలు జరిపిన అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులకు ఉపయోగించాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మెత్సవదర్శనం, వంటివి నిర్వహిస్తుంటారు. వీటితోపాటుగా విష్ణుపురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలుగా ఇవ్వాలని పండితులు చెబుతుంటారు.
భీష్ముడు కోరుకున్నప్పుడు..
పురాణాల ప్రకారంగా భీష్ముడు శంతనుడు, గంగల కుమారుడు. భీష్మ పితామహుడు తన తండ్రి శంతనుడి నుండి ఇచ్చా-ముత్యుని వరం పొందాడని, దాని ప్రకారమే అతను కోరుకున్ననాడే మరణాన్ని పొందగలడని పురాణాల్లో ఉంది. అంతేతప్ప తన ఇష్టానికి విరుద్ధంగా ఎవ్వరూ చంపలేరని పురాణాల్లో ఉంది.
భీష్మ పితామహుని ప్రాముఖ్యత గురించి…
భీష్మ పితామహుడు మహాభారతంలో కౌరవుల పక్షాన పోరాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఉత్తమ జ్ఞానం, మంచి శక్తి మరియు చెడులను అర్థం చేసుకున్నప్పటికీ, తాను అంపశయ్యపై పడుకున్నప్పుడు తన నిర్ణయానికి గల హేతువును వివరిస్తాడు. తాను కౌరవులతో జీవిస్తున్నానని, వారి ఉప్పును కూడా తిన్నానని, ఉప్పు రుణం తీర్చుకోవడానికే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని భీష్ముడు వివరించారు. ఈ కారణంగా మహాభారతంలో పాండవులకు వ్యతిరేకంగా నిలిచాడు భీష్ముడు.
భీష్మాష్టమి పండుగ ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, భీష్మ పితామహుని వర్ధంతి రోజున మాఘ శుక్ల పక్షంలోని అష్టమి తిథి నాడు భీష్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భీష్మ పితామహుడు బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని ప్రతిజ్ఞ చేశాడని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భీష్మాష్టమి రోజున ఉపవాసం పాటించే వారికి సంతానం కలుగుతుంది. సంతానం లేని స్త్రీలు ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉంటారని నమ్ముతారు. వ్రతాన్ని ఆచరించడం వల్ల సద్గురువు మరియు తెలివైన బిడ్డ జన్మిస్తాడు. అలాగే జీవితంలోని కోరికలన్నీ నెరవేరుతాయి.
భీష్మ తర్పణం ఎందుకు ఇవ్వాలి?
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించినాడు, చిట్ట చివర శ్రీకృష్ణుని సన్నిధిలో శరీరాన్ని విడిచిపెట్టి ముక్తిని పొందిన మహానుబావుడు. అయితే ప్రతీ ఒక్కరూ భీష్మ అష్టమి రోజున భీష్మ తర్పణం కచ్చితముగా ఇవ్వాలి. అయితే ఇక్కడ అందరికి ఒక సంశయం వస్తుంది. తర్పణాదులు తండ్రి లేని వారికి కదా? మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం ప్రకారం భీష్మ తర్పణం మరియు యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.
తర్పణం ఎలా ఇవ్వాలి?
మగవారు మాత్రమే ఈ క్రింది తెలిపిన ప్రతీ శ్లోకం చదువుతూ భీష్మునికి తర్పణం ఇవ్వాలి. ఆడవారు ఈ కార్యక్రమాన్ని చేయరాదు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా ఇల్లంతా పూలతో అలంకరణ చేసి మరియు నిత్యపూజలు చేసిన తరువాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటిలోని పూజ మందిరం దగ్గర గాని ఇంటి ఆవరణలోని యెక్కడైనా దక్షిణం వైపుకి కూర్చుని ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధంగా సకల్పం చెప్పాలి. ” పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!”
తదుపరి కొన్ని నీళ్ళు దోసిట్లోకి తీసుకొని ఈ క్రింది తెలిపిన ప్రతీ శ్లోకం చదువుతూ అర్ఘ్యమీయాలి.
1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)
2. వైయాఘ్ర పధ్య గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)
తర్పణం ఫలితం
సశాస్త్రీయంగా ఎవరైతే భీష్మునికి తర్పణం విడిచిపెడతారో వారికి ఎటువంటి దోషములు వున్నా అన్నీ తొలగిపోయి చక్కని సంతానం కలుగుతుంది అని శాస్త్రప్రమాణం.