స్కంద షష్ఠి.. సంతాన షష్ఠి.. జనవరి 5న పూజా విధానం ఇదే..

హిందూ మతంలో పండుగులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  సంతాన దేవతను శుభ్రమణ్యేశ్వరుడిగా భావిస్తారు.  ఈయననే సంతానచ దేవత అంటారు. కుమారస్వామి..స్కందస్వామి.. మురుగన్.. షణ్ముక స్వామి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు.  అంతేకాదు సంధషష్టిని.. కార్తికేయుడి జన్మదినంగా జరుపుకుంటారు.   స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

జనవరి 5 వ తేదీన శుభ్రమణ్య షష్టి.. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల కష్టాలు తీరతాయని.. జీవితంలో విజయం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. అనేక  సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. ఈ రోజున (జనవరి 5)  కార్తికేయుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.

పుష్య మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జనవరి 04న రాత్రి 10 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జనవరి 05 రాత్రి 08:15 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం స్కంద షష్ఠి జనవరి 05వ తేదీ 2025 న జరుపుకుంటారు. భక్తులు కార్తికేయుడిని పూజించే స్కంద షష్ఠి కొత్త సంవత్సరంలో ఇదే మొదటి స్కంద షష్టి.

Also Read : ఇవి దేవుడి కోసమే కాదు.. మన జీవిత ఆనందం... ఆత్మ విశ్వాసం కోసం కూడా.. !

కార్తికేయుడిని ఎలా పూజించాలంటే

  • బ్రహ్మముహూర్తానికి నిద్రలేచి  కాలకృత్యాలు తీర్చుకోవాలి. 
  •  పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • శుభ్రమైన స్థలాన్ని ఎంచుకుని ఆ ప్రదేశాన్ని పూలతో దీపాలతో అలంకరించండి.
  • పీఠంపై కార్తికేయ విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించండి.
  • కార్తికేయ స్వామి ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించండి.
  • నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చందనం, అక్షతం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం అన్నిటిని దగ్గరపెట్టుకోండి
  • గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో కార్తికేయుడిని అభిషేకించండి.
  • దేవుడికి చందనం, అక్షతలు సమర్పించండి.
  • పూజ సమయంలో ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
  • దేవుడికి పూలు సమర్పించడం, తామరపువ్వులను సమర్పించడం విశేషంగా భావిస్తారు.
  • దేవుడికి పండ్లు, స్వీట్లతో పాటు ఆహార పదార్దాలను నైవేద్యంగా సమర్పించండి.
  • కార్తీకేయ ( శుభ్రమణ్యేశ్వర) అష్టోత్తరనామాలు చదువుతూ పూజ చేయండి.
  • స్కంద షష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయండి.

స్కంద షష్టి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • స్కంద షష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది.
  • షష్ఠి వ్రతం చేసే వారు ఈ రోజున పండ్లు తినండి. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి.
  • ఆరోగ్య సంబంధిత సమస్యలున్నవారు షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యంగా ఉంటారు.
  • షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, మద్యపానం తీసుకోకూడదు.
  • ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  ఉపవాస దీక్షను పాటించండి.  దగ్గరలోని శివాలయానికి కాని.. శుభ్రమణ్యేశ్వరుని ఆలయానికి కాని  వెళ్లండి.. స్వామి వారికి పాలను సమర్పించడండి. 
  •   పూజ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో స్మరించుకుంటూ ఉండండి.
  •   పూజ సమయంలో ఎలాంటి వివాదాలు, గొడవలు పెట్టుకోవద్దు. ఉపవాస సమయంలో మాంసాహారం, మద్యం సేవించవద్దు

స్కంద షష్ఠి అనేది హిందూ మతం ముఖ్యమైన పండుగ. ఈ రోజు ( జనవరి 5) కార్తికేయకు అంకితం చేయబడింది.  ఈ రోజున కార్తికేయుడిని పూజించిన భక్తులకు ధైర్యం, తెలివి, విజయం సొంతం అవుతుంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. కార్తికేయుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.