నాగుల చవితి: అర్జునుడు కూడా నాగదేవతకు పాలుపోశాడు...

క్రోధినామ సవంత్సరం కార్తీకమాసం కొనసాగుతుంది.  మొదటి సోమవారం ( నవంబర్​ 4) వతేది.. ఇక ఆతరువాత రోజే అనగా నవంబర్​ 5 వ తేదీన నాగుల చవితి... పర్వదినం..  పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో అర్జునుడు నాగదేవతకు పాలు పోసి  ఆరాధించాడని పురాణాలు చెబుతున్నాయి.   పురాణాల ప్రకారం... నాగుల చవితి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. . 

కార్తీకమాసంలో శుక్ల పక్షం చవితి రోజు.. నాగుల చవితి.  ఈ రోజున హిందువులు సర్పరాజు శుభ్రమణ్యేశ్వర స్వామికి... కుమార స్వామికి.. పాలు  పోసి చలివిడి.. చిమ్మిలి ( బెల్లం.. నువ్వుల మిశ్రమాన్ని) సమర్పిస్తారు.  నాగదేవతను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు.  అర్జునుడు కూడా ఇలానే చేశాడని పురాణాలు చెబుతున్నాయి.   మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో నాగదేవత ( నాగుపాములు)  పాండవులను చుట్టుముట్టాయి.  వారికి నాగ దోషం ఉందని దానికి పరిహారం చేయాలని అక్కడ ప్రత్యక్షమైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆకాశం నుంచి  చెప్పాడు.  

దీంతో నాగుల చవితి రోజు నాగదేవతకు పాలు పోసి.. అర్చిస్తామని అక్కడున్న సర్పాలకు నమస్కరించి చెప్పడంతో ... అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న పుట్టలోకి పాములు వెళ్లాయని శాస్త్రాల ద్వారా చెబుతుంది.     పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు జలందరుడి పుత్రుడు అయిన తక్షక సర్ప రాజును సంహరించడంతో, అతని జన్మ సాఫల్యం పొందిందని...  ఈ నేపథ్యంలో సర్ప దోషం లేకుండా ఉండటానికి నాగుల చవితి రోజు నాగ పూజ చేయాలని పురాణాలు చెబుతున్నాయి. 

హిందూ సంప్రాదాయంలో నాగదేవత పూజ చాలా విశిష్టమైనది. సర్పాలను పూజించండం వలన సంతాన సౌభాగ్యం కలుగుతుంది.  ఇప్పటికి కూడా నాగ దోషం ఉంటే.. వివాహం త్వరగా కాదని.. సంతానం కలగదని పండితులు చెబుతుంటారు.  అందుకే సర్పదోష నివారణకు రాహు కేతువులను పూజించాలని చెబుతుంటారు.  ఇక నాగుల చవితి రోజు ( నవంబర్​ 5) నాగదేవతను పూజించే క్రమంలో .. పుట్టలో పాలు పోస్తే.. శుభ్రమణ్యేశ్వరుని కటాక్షం లభిస్తుందని చెబుతారు.  జాతకంలో  కుండలిని నాగేంద్రుడు ప్రతిబింబిస్తాడు. పురాణాల ప్రకారం గత జన్మల పాపాలు సర్పదోషం కారణంగా నష్టాలు కలుగుతాయి.  అందుకే కచ్చితంగా నాగుల చవితి రోజు పుట్టలో పాలుపోసి నాగేంద్రుడిని పూజిస్తే.. సర్పదోషం తొలగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. 

నాగుల చవితి రోజు నాగదూవతను పూజించడం వలన సర్పదోషం.. సర్పభయాలు తొలగి.. సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.  పూర్వకాలంలో ప్రజలు సర్పాల కారణంగా చాలా ఇబ్బందులు పడే సమయంలో నాగ పూజ చేసిన తరువాత నాగదేవతలు దీవించారని శాస్త్రాలు చెబుతున్నాయి.