తెలుగు నెలల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపారాధనలకు ప్రసిద్ధి అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. హిందూ మతంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. అలాగే పౌర్ణమికి, అమావాస్యకు ప్రత్యేక విశిష్టత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఆ రోజున (ఫిబ్రవరి 24) విష్ణుమూర్తిని పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ పౌర్ణమి సమయంలో స్నానం, దానానికి ప్రత్యేక అర్థం ఉంది. మరి ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం..
మాఘ పూర్ణిమ ఎప్పుడంటే....
పూర్ణిమ తిథి ఫిబ్రవరి 23న ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3:33 నుండి ప్రారంభమై.. ఫిబ్రవరి 24 సాయంత్రం 5.59 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమను జరుపుకోనున్నారు.
మాఘ పూర్ణిమ శుభ ముహూర్తం
అభిజిత్ ముహూర్తం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 24న అర్ధ రాత్రి 12:12 నుండి మధ్యాహ్నం 12:57 వరకు జరుగుతుంది. ఈ సమయంలో స్నానం, దానం చేయడం, పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత
మాఘ పూర్ణిమ నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగాస్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తే, చాలా మంచిది. పాపాలు పోగొట్టుకోవడానికి మాఘ పూర్ణిమ నాడు స్నానం చేసి దానం చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
సూర్యోదయానికి ముందే స్నానం
నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిల్చుని కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషధ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు.
అంత్య పుష్కరిణీ స్నానాలు
సముద్రం, నదుల్లో స్నానమాచరించలేనివారు బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ "గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే, మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు. చివర మూడుస్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.
పవిత్ర నదులలో స్నానం చేయడం ఎందుకు చేయాలి…
ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి… దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు. మాఘ పూర్ణిమ రోజున కాశీ, ప్రయాగ్రాజ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి.
మాఘపూర్ణిమ స్నానఫలం
- ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.
- బావి నీళ్ళతో స్నానం చేస్తే, 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.
- చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.
- సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
- పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
- సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
- గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
- ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.
ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే, మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడుస్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం, మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.