ఆధ్యాత్మికం: శ్రీకృష్ణుడు.. అర్జునిడికి గీత ఎప్పుడు చెప్పాడో తెలుసా..

హిందువులు ప్రతి ఏకాదశిని ఎంతో పుణ్యదినంగా పాటిస్తారు.  మార్గశిర మాసం శుద్ద ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ద్వాపరయుగంలో  ఆరోజే శ్రీకృష్ణుడు అర్జునిడికి గీత ( భగవద్గీత ‌‌) వివరించాడని  పురాణాలు చెబుతున్నాయి.  అందుకే హిందువులు అదే రోజున గీతాజయంతిని జరుపుకుంటారు.  చాంద్రమానం ప్రకారం ఈ ఏడాది ( 2024) డిసెంబర్​ 11న ఏకాదశి వచ్చింది.  కావున అదేరోజున గీతాజయంతిని జరుపుకుంటారు.  పండితులు.... పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ( 2024) గీతా జయంతి 5,161 వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  

గీతా జయంతి ఎప్పుడు 

ఈ ఏడాది ( 2024) మార్గశిర శుక్లపక్షం ఏకాదశి  డిసెంబర్​ 11న  తెల్లవారుజామున 03:42 గంటలకు ప్రారంభమై ... మరుసటి రోజు  డిసెంబర్ 12  ఉదయం ( రాత్రి)  01:09 ( తెల్లవారితే డిసెంబర్​ 13 ) గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయ తిధి ప్రకారం...  డిసెంబర్ 11న గీతా జయంతిని జరుపుకుంటాము. గీతా జయంతి రోజున రవియోగం ఏర్పడుతుంది, కానీ ఈ రోజున భద్రుని నీడ కూడా ఉంటుంది.

గీతా జయంతి శుభ ముహూర్తం

 

  • శుభ ముహూర్తం( బ్రహ్మ ముహూర్తం):  ఉదయం 05:07 నుంచి 06:01 వరకు
  • అమృత కాలం: 09:34 నుంచి 11:03 వరకు
  • నిషితా ముహూర్తం: 1:03 నుంచి 11:03 వరకు
  • డిసెంబర్ 12 వరకు రవియోగం ఉదయం 06:56 నుంచి 11:48 వరకు
  • అశుభ ముహూర్తం: (రాహు కాలం) - మధ్యాహ్నం 12:05 నుంచి 01:22 వరకు
  • భద్రకాలం: 02:27 నుండి 01:09 వరకు

గీతా జయంతి ప్రాముఖ్యత

కురుక్షేత్ర యుద్దం... ఇది  పాండవులకు.. కౌరవులకు మధ్య జరిగింది.  ఈ యుద్ద సారాంశాన్ని పరిశీలిస్తే.. శ్రీకృష్ణుడు..   జీవిత రహస్యాన్ని.. జన్మ.. కర్మ సిద్దాంతాన్ని  అర్జునిడికి వివరించి అతని మనోబలాన్ని పెంచాడు. దీనినే గీతోపదేశం అంటారు.  గీతోపదేశాన్ని భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు.. 700 శ్లోకాలు ఉన్నాయి.  ఇవి మానవులకు ఙ్ఞానాన్ని అందిస్తాయి.  భగవద్గీతను పఠించడం.. శ్రీకృష్ణుడిని పూజించడం వలన ఆధ్యాత్మిక పురోగతికి దారి  తీస్తుంది. 

త్రేతాయుగంలో పాండవులు... కౌరవుల యుద్ద సమయంలో  .. మార్గశిర మాసంలో  ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు...అర్జునిడికి గీతోపదేశం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.  కురుక్షేత్ర మహా సంగ్రామ సమయంలో 45 నిమిషాల పాటు భగవద్గీతను వివరించాడు.  ఇందులో మోక్షం ఎలా పొందాలి.. అనే అంశంతో పాటు.. శ్రీకృష్ణుడు ... అర్జునిడికి చెప్పిన విషయాలు మానవులకు ఎంతో ఆదర్శప్రాయం. గీతా జయంతి రోజును  లోకాధిపతి అయిన విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున  ( డిసెంబర్​ 11) ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల స్థానికుల ఆగిపోయిన పనులన్నీ విజయవంతమవుతాయని, జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.


గీతా జయంతి పూజ విధి

  • గీతాజయంతి రోజున ఉదయాన్నే లేచి బ్రహ్మమూర్త సమయానికి కాలకృత్యాలు తీర్చుకొని పసుపురంగు దుస్తులు ధరించాలి.
  • విష్ణుమూర్తిని అక్షింతలు..పూలతో పూజించండి... అలాగే శ్రీకృష్ణుడిని తులసి దళాలతో పూజించండి.  స్వామి వారికి వెన్న సమర్పించండి
  • భగవద్గీత పారాయణం చేయండి
  • సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం ఇవ్వండి.
  • ఉపవాస దీక్షను పాటించండి. 
  •  భగవద్గీత పుస్తకాన్ని దానం చేయడం శుభప్రదం
  •  ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు.