హిందువులు ప్రతి ఏకాదశిని ఎంతో పుణ్యదినంగా పాటిస్తారు. మార్గశిర మాసం శుద్ద ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ద్వాపరయుగంలో ఆరోజే శ్రీకృష్ణుడు అర్జునిడికి గీత ( భగవద్గీత ) వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే హిందువులు అదే రోజున గీతాజయంతిని జరుపుకుంటారు.
హిందు మతంలో గీతా జయంతిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది (2024) డిసెంబరు 11న గీతాజయంతి వచ్చింది. ఆ రోజున విష్ణువును చాలా మంది ఆరాధిస్తుంటారు. నారాయణుడి గుడికివెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. గీతాజయంతి రోజున ( డిసెంబర్ 11 ) సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాల అనంతరం.. విష్ణు స్వరూపమైన నారాయణుడిని అలంకరించి పూజలు చేయాలి. విష్ణుసహస్రనామం పఠించాలి. అదే విధంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేయాలి. ఐదు రకాల పండ్లు, స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. ఆరోజున నోరులేని జీవాలకు, పేదవాళ్లకు తమకు తోచిన విధంగా దాన, ధర్మాలు చేయాలని పండితులు చెబుతున్నారు.
డిసెంబర్ 11 గీతాజయంతి రోజ ఏం చేయాలంటే....
- భగవద్గీత పారాయణం: గీతాజయంతి రోజున భగవద్గీతను పారాయణం చేయాలి. ఇది పుణ్యకార్యమని పండితులు చెబుతారు. గీత చదవడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం లభిస్తుంది.
- మంత్ర పఠనం: ఓం నమో భగవతే అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
- తులసి పూజ: తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున తులసి మొక్కను పూజించి, తులసి దళాలను దేవునికి సమర్పించండి.
- శ్రీకృష్ణుడిని ఆరాధించాలి: కృష్ణుడి విగ్రహం .. లేదా చిత్ర పటం ముందు దీపం వెలిగించి.. ధూపం .. దీపం.. పువ్వులు సమర్పించాలి. స్వామి వారికి వెన్నతో తయారు చేసిన పదార్ధాలను నైవేద్యం సమర్పించాలి.
- ఉపవాసం: డిసెంబర్ 11 ఉపవాస దీక్షను పాటించండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం లభిస్తుంది.
- దానం: పేదలకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి.
మాసానాం మార్గశిర్షోహం అంటారు. అంటే.. అన్ని నెలలకు కూడా ఈ మాసం శిరస్సు తల వంటిదని అర్థం. ఈ నెలలోనే కురకేత్ర యుద్దం స్టార్ట్ అయ్యిందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. మార్గశిర మాసంలో శుక్ల పక్ష ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి.. అర్జునుడికి గీతా ఉపదేశం చేశాడు. ప్రతి మానవుడు కర్మయోగం ప్రకారం నిస్వార్థంగా జీవితం గడపాలి. మోక్షం అంటే భగవంతుని ఆరాధిస్తూ ఆయనలోనే ఐక్యం అయ్యే ప్రక్రియ. భగవద్గీత జీవిత సత్యాన్ని .. ఎలా నడచుకోవాలి.. అనే విధానాల గురించి వివరిస్తుంది. మనిషి .. భగవంతునికి ఎలా దగ్గరవ్వాలో మార్గాన్ని సూచిస్తుంది.