ధనుర్మాసం విశిష్టత : మూడవ రోజు పాశురము.. మార్గళిస్నానం చేస్తే దరిద్రమే రాదు.. !

మూడవ రోజు పాశురము

  • ఓం  యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి నాఙ్గళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్ తీజ్లిన్రి నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు 
  • ఓఙ్గు వళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప 
  • తేజ్గా దే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి 
  • వాఙ్గ- క్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
  •  నీజ్గాద శెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

భావము: ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది.

బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని తీసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది, ఆకాశమంత ఎత్తు కెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానా న్ని ఆచరిస్తే దుర్భిక్షం కలగదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. 

ALSO READ : ధనుర్మాసం: గోదాదేవి ఎవరు ? తిరుప్పావై పాశురాలు అంటే ఏమిటి?

పంటలన్నీ త్రివిక్రముడికి వల్లే ఆకాశమంత ఎత్తు కెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీళ్లలో విరిసిన కలువలను చేరిన తుమ్మెదలు మకరందాన్ని తాగి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే! ఇక పాలు పితికే గోవుల పొదుగలను తాకగానే కలశాలు నిండుగా పాలు పొంగి పొరలుతాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోదాదేవి..!

-వెలుగు, లైఫ్​ –