రంగులు మార్చే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.. వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. సైన్స్ కు సవాల్ కు విసురుతూనే ఉంది.  వాస్తవానికి, ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం రోజుకు మూడు సార్లు దాని రంగును మార్చుకుంటుంది.

రాజస్థాన్లోని ధోల్పూర్లో అచలేశ్వర్ మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం రంగులు మార్చుతుం ది. ఉదయం ఎర్రగా, మధ్యాహ్నం కాషాయరంగులో, సాయంత్రం చామన ఛాయలో కనిపిస్తుంది. సహజంగా లింగాలు సాలగ్రామరూపంలో లేదా స్ఫటిక రూపంలో ఉంటాయి. ఇక్కడి లింగం సాలగ్రామరూపంలో ఉంది. కానీ మూడువేళల్లో మూడు రంగుల్లో కనిపిస్తుంది. దాంతో భక్తులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. 

రోజుకు మూడు రంగులు

ధోల్‌పూర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది.  ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో..  సాయంత్రం వేళ చామర ఛాయగా (నీలం) రంగుల్లోకి మారి.. భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకూ ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరీ.. రంగులను మార్చే శివలింగాన్ని చూసి తరించిపోతారు

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి శివలింగాన్ని మూడు రంగుల్లో దర్శించుకుని వెళ్తారు.శివలింగం రంగులు మార్చుకోవడం వెనక కారణాల గురించి అనేక పరిశోధనలు జరిగాయి. కొందరు శివలింగం మీద సూర్యకాంతి పడటం వల్ల ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు. అలాగే ఈ శివలింగం గురించిన కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచ లోహాలతో తయారుచేశారు.

 చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని ‘అచలేశ్వర్ మహాదేవ్’ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున, ఇంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు.. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత..  భక్తులు సంఖ్య పెరిగింది.  రంగురంగులు మారుస్తున్న  శివలింగం గురించి  అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. 

 ఇక్కడి పురాణ కధనం మేరకు.. ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు  తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది. ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివ లింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం  శివలింగం స్వయం భూ కదా ? మరి అది ఎంత లోతు ఉందొ చూడాలని గతంలో రాజులు, చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వేకొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటం తో వారు ఆ పనిని నిష్క్రమించారు.

మహిమ కలిగిన ఆలయం

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని  సందర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ఇది మాత్రమే కాదు.. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడ పూజలు వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట. పెళ్లికాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే.. శివుడి అనుగ్రహంతో పెళ్ళికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట.పరమశివుని బొటనవేలిని పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఇక్కడ ఉన్న నంది మొత్తం ఇత్తడితో చేయబడింది. ఇక్కడి శివలింగం ఎలా పుట్టిందో, ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. శాస్త్రవేత్తలను కూడా ఇది ఆశ్చర్యపరిచింది.శివలింగానికి అద్భుతశక్తులున్నాయనే నమ్మకం ఉంది. ఈ గుడిలో ప్రార్థించిన వారందరికీ వారి కోరికలు తప్పక ఫలిస్తాయని భావిస్తారు.