అత్తివరదార్​ స్వామి ( విష్ణుమూర్తి): 40 ఏళ్లకొక్క సారి ఈస్వామి దర్శనం.. మళ్లీ ఎప్పుడంటే..

తమిళనాడులోని కాంచీపురం సిటీ ఆఫ్ టెంపుల్స్ గా ప్రసిద్ధి, వెయ్యికి పైగా దేవాలయాలు ఉన్నాయి. ఈ పట్టణంలో ఏ ఆలయం చూసినా.. దేనికదే ప్రత్యేకం. అందులో.. విష్ణుమూర్తి అవతారం అత్తివరదార్ స్వామి ఆలయం ఇంకా ప్రత్యేకం. వైష్ణవుల 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి. అయితే, ఇక్కడ అత్తివరదార్ స్వామి నలభై ఏళ్లకు ఒకసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. 

కోనేటిలో ఉండే స్వామివారి విగ్రహాన్ని ప్రతి నలభై ఏళ్లకు ఒకసారి బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. అందుకే జీవితంలో అత్తివరదార్ స్వామి దర్శనం బహుశా ఒక్కసారే వస్తుందేమో! చాలా తక్కువ మందికే రెండోసారి దర్శనం చేసుకునే భాగ్యం దక్కుతుంది. 1979 తర్వాత స్వామి వారి దర్శన భాగ్యం 2019లో  -కలిగింది. అందుకే, వయసుతో సంబంధం  లేకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. మళ్లీ ఈ స్వామి దర్శనం 2059లో కలుగనుంది. 

అప్పుడు  జూలై 1వ అత్తి వరదాద్' వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 17 వరకు అత్తి పరదార్ స్వామి దర్శన భాగ్యం లభించింది.  మొదటి 38 రోజుల శయన (నేలకు ఒరిగిన) భంగిమలో... చివరి పది రోజులు నిటారుగా నిలబడిన భంగిమలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకున్నారు. ఆ తర్వాత తిరిగి కోనేరులోకి వెళ్లిపోయారు. పన్నెండు అడుగుల విగ్రహాన్ని వెండిపెట్టెలో పెట్టి అనంత సరోవరం పుష్కరణిలో ఉన్న నాలుగు పిల్లర్ల మంటపం అడుగు భాగంలో పెట్టి నీటితో నింపి ....స్వామి వారి విగ్రహంలోకి నీళ్లు చేరకుండా..  వెండి పెట్టెలో భద్రపరుస్తారు. 

బంగారు, వెండి బిల్లులిక్కడే

అత్తి పరదార్ స్వామి ఆలయం ఉన్న కొండ ఏనుగు రూపంలో ఉంటుంది. ఇక్కడ  మూలవిరాట్టు పడమర వైపు, అమ్మవారు.. తాయారు పేరిందేవి తూర్పువైపు నిలబడినట్టు  భక్తులకు దర్శనమిస్తారు. కోరిన వరాలు తీర్చే దైవంగా కొలువైన స్వామిగా ఆయన్ను కీర్తిస్తారు. కంచి అనగానే చాలామందికి బంగారు, వెండి బల్లులు గుర్తుకొస్తాయి. అవి ఉన్నది ఇక్కడే. ఈ బల్లుల్ని తాకితే బల్లి మన మీద పడిన దోషం పోతుందని నమ్మకం.

ఎవరీ అత్తి వరదార్?

విష్ణుమూర్తి అవతారమే వరదరాజ పెరుమాళ్​. కృత యుగంలో దేవ శిల్పి విశ్వకర్మ స్వయంగా ఈ విగ్రహాన్ని చెక్కారని పురాణాలు చెవున్నాయి. అత్తి (మేడి) చెట్టు కాండంతో చెక్కిన విగ్రహం కనుక ఆయన్ను అత్తి వరదార్​ స్వామి అని కూడా పిలుస్తున్నారు. సోమకుడు అనే రాక్షసుడిని మత్స్యావతారంలో ..... వధించి వేదాలను కాపాడిన శ్రీ మహావిష్ణువు అవతారంగా వరదార్​ స్వామిని తమిళులు ఆరాధిస్తారు.

 ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పాండ్యులు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు సైతం స్వామి వారికి కానుకలు సమర్పించిన విషయాన్ని ఇక్కడి శిలాశాసనాల్లో  చూడొచ్చు. 23 ఎకరాల్లో విస్తరించిన వరదరాజ స్వామి ఆలయం వాటి కళావైభవానికి అద్దం పడుతుంది. 

1709లో బయటపడింది

16-–17 శతాబ్దంలో శత్రు మూకలు దక్షిణ భారతదేశంపై దండెత్తాయి. ముఖ్యంగా దేవాలయాలపై దాడులు చేసి ఆలయ సంపదను కొల్లగొట్టాయి. దీంతో వరదరాజ స్వామి ఆలయంపై కూడా దాడి జరుగుతుందని భావించారు పూజారులు. అప్పుడు దేవుని విగ్రహాన్ని (మూల విరాట్టు) పెద్ద వెండి పెట్టెలో ఉంచి, పుష్కరిణిలో భద్రపరిచారు. ఇక స్వామి ఉత్సవ మూర్తిని తిరుమల శ్రీవారి ఆలయానికి తరలించారు. కొన్నాళ్లకు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. భద్రపరిచిన సంగతి రహస్యంగా ఉంచడం వల్ల మూల విరాట్లు జాడ ఎవరికీ తెలియలేదు. ఎంత
దొరకలేదు. దాంతో పూజలు నిలిచిపోయాయి. కొన్నాళ్లకు వరదార్ స్వామి శిలా విగ్రహం తయారు చేయించి ఆలయంలో ప్రతిష్ఠించారు.

 తిరుమల నుంచి వరదరాజ స్వామి ఉత్సవ మూర్తిని కూడా తిరిగి కాంచీపురానికి తీసుకొచ్చారు. ఇలా నలభై ఏళ్లు గడిచిపోయాయి. 1709లో అనంత సరోవరంలో నీటి మట్టం అడుగంటింది. దీంతో పుష్కరిణిలో దాచిన పరదరాజ స్వామి విగ్రహం దొరికింది. దీంతో అప్పటి నుంచి 40 ఏళ్లకు ఒకసారి విగ్రహాన్ని బయటకు తీసి 48 రోజులు పాటు అత్తి వరదార్​  ఉత్సవాలు జరపడం మొదలు పెట్టారు. తర్వాత మళ్లీ జల గర్భంలో దాచడం అనవాయితీగా కొనసాగించారు.

కంచికి ఎలా వెళ్లాలంటే

చెన్నై నుంచి కాంచీపురం 70 కిలో మీటర్లు ఉంటుంది. చైన్నైకి  రైల్లో కాని, విమానంలో కాని... రోడ్డు మార్గంలో కాని చేరుకొని అక్కడి నుంచి కాంచీపురం వెళ్లవలసి ఉంటుంది. చెన్నై నుంచి కాంచీపురానికి లెక్కలేనన్ని బస్సులు. రైలు. కార్లు నడుస్తుంటాయి. అయితే, స్వామి వారి దర్శనం అంత తేలికేమి కాదు. నలభై ఏళ్లకు ఒక్కసారే దర్శనానికి అవకాశం ఉండటం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రోజుకు నాలుగు లక్ష మంది దర్శించుకుంటున్నారని అంచనా. వీకెండ్స్ లో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాంచీపురానికి చేరుకోగానే.. అత్తివరదార్​ స్వామి ఆలయానికి ఎలా వెళ్లాలో, సైన్ బోర్డులు ఉంటాయి. కాంచీపురం పట్టణం లోపలికి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయం కనిపిస్తుంది. 

మామూలు రోజుల్లో.. వెహికిల్స్ ని గుడి దగ్గరి వరకు అనుమతిస్తారు. కానీ, రద్దీ వల్ల ఈ 48 రోజులు గుడికి రెండున్నర. ..మూడు కిలోమీటర్ల ముందే వెహికిల్స్ పార్కింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కాలినడకనే గుడికి చేరుకోవాలి. దేవుడిపై నమ్మకంతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా నడిచి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కి స్పెషల్ క్యూతో పాటు.. వీల్ చైర్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే, రద్దీ వల్ల 30 సెకండ్ల కన్నా ఎక్కువసేపు భక్తులకు స్వామిని చూసే అవకాశం ఇవ్వడం లేదు దర్శనానికి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది.. వీకెండ్స్ లో పది నుంచి పన్నెండు గంటలు పడుతోంది.