శ్రావణ పుత్రదా ఏకాదశి  ఎప్పుడు.. ఆరోజు ఏంచేయాలి

హిందూ ధర్మ సంప్రదాయంలో ఒక్కో ఏకాదశికీ ఒక్కో ప్రాముఖ్యత ఉంది. పుత్రద ఏకాదశికి కూడ ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే శుద్ద  ఏకాదశికి  ( పౌర్ణమికి ముందు) పుత్రద ఏకాదశి అని పేరు ఉంది. భవిష్య పురాణంలో పుత్రద ఏకాదశి విశిష్టత చాలా వివరంగా ఉంది. 

శ్రావణ పుత్రదా ఏకాదశి కథ (Shravana Putrada Ekadashi Story)

 మహిజిత్తు అనే మహారాజు పాలించే రాజ్యంలో ఉన్న ప్రజలు అంత సిరిసంపదలతో సంతోషముగా ఉంటారు. కానీ రాజు గారికి సంతానం లేదు, ఈ కారణంగా దేశ ప్రజలు బాధతో ఉండేవారు. మహారాజు సంతానం కోసం తిరగని పుణ్యక్షేత్రం లేదు. దీనికి పరిష్కారం మహరాజు తెలుస్తుంది. అదేమిటంటే రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి దగ్గర ఉందని. ఆయన్ని దర్శించుకోని వారికున్న సందేహం విన్నవించుకుంటారు. మహారాజు కి ఏ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందో వివరించాలని ప్రజలు ఆ లోమశు మహర్షిని వేడుకున్నారు. దాంతో ఈ పుత్రద ఏకాదశి పూజ విధానం మరియు ఎలా ఆచరించాలో ఇలా చెప్పాడు. 

శ్రావణ మాసంలో మొదటి ఏకాదశి రోజున నిష్టగా చేస్తే మహారాజుకి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. ఆయన సూచన మేరకు రాజదంపతులతో పాటుగా ఆ రాజ్యంలోని ప్రజలందరు ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే రాజు గారికి పుత్రసంతానంతో పాటు ఎవరికైతే సంతానం లేదో ఈ వ్రతం ఆచరించిన వాళ్ళందరికి సంతానం ప్రాప్తించింది. అందుకే అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు. 

2024 పుత్రదా ఏకాదశి ముహూర్తం వివరాలు

  • ఏకాదశి తిథి ప్రారంభం : ఆగస్టు 15....10.27 AM 
  • ఏకాదశి తిథి ముగింపు:  ఆగస్టు 16..... 9.40 AM 
  • హరి వాసర ముగింపు క్షణం : ఆగస్ట్ 16....3:16 PM
  • పరానా సమయం ఆగస్టు 17...6:08 AM 

శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతం పూజా వివరాలు

దంపతులు పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి రోజు నుండి ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామం వంటి స్తోత్రాలతో పూజించాలి. ఆ ఏకాదశి రోజున రాత్రి పూట జాగరణ చేయాలి. తర్వాత రోజున దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించాలి. ఉపవాసాన్ని ద్వాదశి ఘడియలు ముగిసేలోగా విరమించాలి. నిష్టగా ఉపవాసాన్ని చేస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని అని నమ్మకం మరియు సంతానం కలుగుతుంది.

శ్రావణ పుత్రదా ఏకాదశి ఆచారాలు

 

  • శ్రావణ పుత్ర ఏకాదశి నాడు ఉపవాసం ప్రధాన ఆచారం. మగబిడ్డ కోసం ఆరాటపడితే భాగస్వాములిద్దరూ తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి. సంతానం కావాలనుకునే దంపతులు కఠినమైన ఉపవాసాన్ని పాటించాలి.  ఆరోగ్య కారణాల వలన ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ధాన్యాలు, పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు మరియు మాంసాహారం  అసలు తినకూడదు.
  • వ్రతం 'దశమి' నాడు ప్రారంభమవుతుంది . దశమి రోజు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. దశమి రాత్రి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటిస్తారు. ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి' (12వ రోజు) తెల్లవారుజాము వరకు ఆహారం తీసుకోరు. పూజా క్రతువులు ముగించి,  బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చి.. ఉపవాసం విరమించాలి.
  • శ్రావణ శుద్ద ఏకాదశి రోజున  శ్రీమహావిష్ణువును భక్తితో... ఉత్సాహంతో.. నిష్టగా పూజించాలి. పూజా స్థలంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని  ఉంచి 'పంచామృతం' అభిషేకం చేయాలి. పూలు, పసుపు, కుంకుమతో అర్చించి .. విష్ణు సహస్రనామం పఠించాలి.  లేదా శ్రద్దగా విన్నా సరిపోతుంది.
  • శ్రావణ పుత్రదా ఏకాదశిని చూసేవారు విష్ణువును స్తుతిస్తూ భజనలు....భక్తి పాటలు పాడుతూ రాత్రంతా జాగారం చేస్తారు. భక్తులు సాయంత్రం సమయంలో సమీపంలోని విష్ణువు ఆలయాలను కూడా సందర్శించాలి
  • పుత్రదా ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ​అనేమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.

శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతం విశిష్టత

 శ్రావణ శుద్ధ ఏకాదశికి అత్యంత ప్రత్యేకత కలిగి ఉంది. పుత్రద ఏకాదశి రోజున కుబేరుని జన్మదినం అని నమ్మకం. కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే సిరి సంపదలు ప్రసాదించు మరియు అనుగ్రహం తప్పక లభిస్తుంది. కుబేర అష్టోత్తరాన్ని పఠించినా శుభ ఫలితాలు దక్కుతాయి.