కామికా ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏంచేయాలి..

తెలుగు పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో శుక్ల పక్షంలో ఒక ఏకాదశి..క్రిష్ణ పక్షంలో మరో ఏకాదశిని కలుపుకుని.. ప్రతి నెలా రెండు ఏకాదశి తిథులు వస్తాయి. ఈ పర్వదినాన శ్రీ విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఆషాఢ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. శాస్త్రాల ప్రకారం, చాతుర్మాస కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ కాలంలో శ్రీ విష్ణుమూర్తిని తులసీ దళాలతో ప్రత్యేక పూజలు చేయడం, వెన్నతో పాటు మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో 2024లో ఆషాఢ మాసంలో కామిక ఏకాదశి ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం, పూజా విధానం ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పంచాంగం ప్రకారం, కామికా ఏకాదశి జూలై 30, 2024 సాయంత్రం 04:44 గంటలకు ప్రారంభమవుతుంది. జూలై 31, 2024 మధ్యాహ్నం 03:55 గంటలకు ముగుస్తుంది. తిథి ప్రకారం, జూలై 31 న కామిక ఏకాదశి ఉపవాసం ఉండాలి.

ALSO READ | వారఫలాలు ( సౌరమానం) జులై 21 నుంచి 27 వరకు

కామికా ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపాలు నశిస్తాయి. ఈ ఏడాది ఆషాడ మాసంలోని కృష్ణపక్షం రోజున కామికా ఏకాదశిని (జూలై 31)నిర్వహించుకుంటారు. కామికా ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.  ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.

పూజా విధానం..

  •  కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి.
  •  అనంతరం ఉతికిన బట్టలు వేసుకుని, ఇంట్లో పూజా గదిని శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి.
  • ఒక ఎర్రని వస్త్రంపై విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
  • ఏకాదశినాడు మహా విష్ణువును పూజించాలి.
  •  ఆ తర్వాత శ్రీహారికి పువ్వులు, పండ్లు, తులసిని సమర్పించాలి.
  • పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి.
  •  ఇప్పుడు స్వామికి పసుపు, చందనం, పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. 
  •  అనంతరం   నెయ్యితో  దీపారాధన చేసి, కామికా ఏకాదశి వ్రతం కథ, మంత్రాలను చదవాలి.
  •  చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
  •  ఈరోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటిరోజు ఉపవాసాన్ని విరమించాలి.
  • శ్రీ మహావిష్ణువు చాలీసాను పఠించాలి. భక్తితో స్వామి వారికి హారతి ఇవ్వాలి.
  • పెసరపప్పును నానబెట్టి ప్రసాదంగా సమర్పించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి  ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. వారికి దక్షిణ సమర్పించాలి. ఆ తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి.

 కామిక ఏకాదశి కోరిన కోరికలు నెరవేరే ఏకాదశిగా చెప్పుకుంటారు. ఈరోజున విష్ణువును పూజిస్తే పితృ దేవతలు సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కామిక ఏకాదశి చేయడం వల్ల అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యం దక్కుతుంది. విష్ణువు పాద పద్మాలను తాకడం వల్ల ఎంతో మంచిది. కామికా ఏకాదశి వ్రతాన్ని చేసే భక్తులు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమ:’ అని జపిస్తూ ఉండాలి.

ఎవరైతే తమ జీవితంలో తెలియకుండా తప్పులు చేస్తారో.. ఎవరైతే తమ లైఫ్‌లో ఇబ్బందులు పడతుంటారో వారంతా కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున శ్రీహరిని పూజించడం వల్ల మన పూర్వీకులు సంతోషిస్తారని, వారి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పూర్వీకుల ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు కచ్చితంగా పొందుతారు. ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే ఈరోజున మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి.