అరోమా నూనెలు వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

అరోమా థెరపీ కోసం మార్కెట్లో రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించు కునేందుకు మాత్రమే కాకుండా.. అనేక రుగ్మతలకు సుగంధ నూనెల వాడకంతో ఉపశమనం కలుగుతుందని చాలామంది నమ్మకం. అయితే అన్ని నూనెల గురించి ఏమో గానీ, లావెండర్, టీ ట్రీ ఆయిల్స్ మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో పరిశోధనలు చేశారు. కౌమార వయసులో అబ్బాయిల రొమ్ములు అసాధారణంగా పెరిగేందుకు ఈ నూనెలు కారణమవుతున్నాయన్నారు. 
కానీ గతంలో జరిగిన ఒక అధ్యయనం మాత్రం నూనెలకు.. హార్మోన్ల ఉత్పత్తికి సంబంధం లేదని స్పష్టం చేసింది.

అయితే, తాజాగా జరిగిన అధ్యయనంలో ఎసెన్షియల్ నూనెల్లోని ఎనిమిది రసాయనాలతో ముప్పు తప్పదని వెల్లడైంది. ఈ నూనెలను ఎలాంటి నియంత్రణ లేకుండా అమ్ముతున్నారన్నారు. వాటి వల్ల వచ్చే సమస్యల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ నూనెలను వాడి ఇబ్బందులకు గురవుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

వెలుగు లైఫ్..