ఎండాకాలం చాలా మంది చెరకు రసం తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. చెరకు రసంలో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియంతో సహా వివిధ పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం.చెరకు రసం తరచుగా తాగడం మనకు ప్రమాదకరం. కాబట్టి చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు, కలిగే అనారోగ్య ప్రభావాలేంటో తెలుసుకుందాం.
వేసవి వచ్చేసింది. ఈ సమయంలో వేసవి ఎండల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మన ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరాన్ని చల్లబరచడానికి, వేసవి తాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికీ, తగినంత హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి వివిధ రకాల జ్యూస్‌లు తాగాలి.ఈ సమయంలో చాలా మంది చెరకు రసం తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చెరకు రసంలో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియంతో సహా వివిధ పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం.
చెరకు రసంలో వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయనాలు ఇందులో కేలరీలు అధికంగా ఉన్నాయని చూపించాయి. ఒక గ్లాసు చెరకు రసంలో 250 కేలరీలు, 100 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువల్ల చెరకు రసాన్ని ఎక్కువగా లేదా నిరంతరం తాగడం వల్ల ఊబకాయం (బరువు పెరగడం) సమస్యకు దారితీస్తుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
చెరకు రసంలో పాలీకోసనల్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. అంటే ఇది మన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కానీ కొన్నిసార్లు అది మనకు ప్రమాదకరం. ఎందుకంటే మనకు గాయమైనప్పుడు, రక్తం కారుతుంది. గడ్డకట్టకపోతే, చాలా రక్తం పోతుంది. అందుకే చెరకు రసం ఎక్కువగా తాగవద్దంటారు.
యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే చెరకు రసంలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే చెరకు రసం కామెర్ల వ్యాధికి బెస్ట్ రెమెడీ. ఇది కాలేయాన్ని బలంగా చేస్తుంది. చెరకు రసంలోని వివిధ యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. ఇది బైలిరుబిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కామెర్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు మన శరీరంలోని ప్రోటీన్ చాలా వరకు విచ్ఛిన్నమవుతుంది. ఇది రక్తంలో బైలిరుబిన్ స్థాయిని పెంచుతుంది. ఈ బైలిరుబిన్ స్థాయిని నియంత్రించడానికి చెరకు రసం తీసుకుంటారు. కోల్పోయిన, నాశనం చేసిన ప్రోటీన్‌ను చెరకు రసం తిరిగి నింపుతుంది.
చెరకు రసం మితంగా తాగడం వల్ల మనకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. కానీ అతిగా తాగడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. చెరకు రసం మాత్రమే కాదు, ఏ పదార్ధమైనా అధికంగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ప్రమాదకరమని గుర్తుంచుకోండి