ఎన్ని రకాల వంటకాలు తిన్నా చివర్లో పెరుగు తినకుంటే కొందరికి తిన్నట్లు కూడా ఉండదు. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి మంచిగా ప్రోటిన్లు, విటమిన్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు.. ఇలాంటి ఆహారంలో పాలు ఒకటి.. పాలలో ఎన్నో ప్రోటిన్లు ఉన్నాయి. అయితే, పాలు, పాలతో తయారయ్యే ఆహార పదార్థాలు ఏవైనా ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ఎంతో మంచివని భావిస్తారు.
అయితే రోజూ పెరుగు తినడం మంచిదేనా అనే సందేహాలు కూడా మనలో రావడం సహజం. ఆరోగ్యం సాధారణంగా ఉన్నంత వరకు.. పరిమిత మోతాదులో పెరుగు తింటే.. అది ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు.. కానీ జలుబు, దగ్గు ఉన్నప్పుడు పెరుగు తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పెరుగు తింటే ఏమవుతుందో చూద్దాం..
ప్రోబయోటిక్స్..
మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో వేడి వంటి మొదలైన వాటిని పెరుగు నివారిస్తుంది. విటమిన్ బి12 మొదడుకు, రక్తనికి చాలా అవసరం.. పాలతో తయారైన పెరుగు తినడం వల్ల ఈ విటమిన్ లభిస్తుంది. దీనివల్ల అలసట, నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అది కూడా లిమిట్ గా తీసుకుంటే మరీ మంచిది లేకుంటే మాత్రం ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు.
మంచి బ్యాక్టీరియా..
పెరుగు మంచి బ్యాక్టీరియా సంఖ్యను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
పుష్కలమైన పోషకాలు..
పెరుగు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి పెరుగు తింటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. దహీ వడా, రైతా వంటి వివిధ రకాల వంటకాలను పెరుగుతో చేసి చాలా మంది ఎంతో ఉత్సాహంగా తింటారు. అవేకాదు.. మజ్జిగను కూడా తినగానే ప్రతిరోజూ తాగుతారు. ఇలా.. ప్రతిరోజూ పెరుగు తినడానికి ఇష్టపడతారు.
ప్రోటీన్..
శరీరంలో కండరాలు, చర్మ, గోర్లు మొదలైనవి ప్రోటీన్ తో తయారు చేయబడ్డాయి. కాబట్టి ప్రతిరోజూ ప్రోటీన్ తీసుకోవడం మనకు చాలా ముఖ్యం.. పెరుగులోని ప్రోబయోటిక్స్ అనేది మన గట్ లో ప్రత్యేక్ష బ్యాక్టీరియా, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో.. పోషకాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది.
ALSO READ : Good Health : షుగర్ ఉన్నోళ్లు.. ఎలాంటి డ్రైఫ్రూట్స్.. ఎంతెంత తినాలి..!
కాల్షియం..
పాలు, పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి సమృద్ధిగా కాల్షియాన్ని అందిస్తాయి. కాబట్టి కాల్షియంతో శరీరంలోని ఎముకలు బలపడుతాయి. డైలీ పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలోని కాల్షియం లోపాన్ని తీర్చి, ఎముకలు బలహీనపడకుండా ప్రయోజనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.