Good Health : ఏ వయస్సు వారు ఎంత ఉప్పు తీసుకోవాలి.. ఉప్పు ఎక్కువైతే బీపీతోపాటు వచ్చే వ్యాధులు ఏంటీ..

ఉప్పు లేకుండా కూరలను, ఇతర ఫుడ్ ఐటమ్స్ ను అస్సలు తినలేం. ఉప్పే ఆహారాలను టేస్టీగా చేస్తుంది. నిజానికి మన శరీరానికి ఉప్పు కూడా అవసరమే. కానీ మోతాదుకు మించి ఉప్పును తింటే మాత్రం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది.  ఉప్పు  అంటే సోడియం.   దీనిని ను ఎక్కువగా వేయడం వల్ల ఫుడ్ రుచి మారుతుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి.. ఏ వయస్సు వారు  ఎంత మోతాదులో తినాలో  తెలుసుకుందాం, , , 

ఉప్పులేని కూరలు, ఆహార పదార్థాలు అసలే ఉండవు. ఎందుకంటే ఉప్పుతోనే వంటల రుచి తెలుస్తుంది. అసలు ఉప్పు లేని వంటలను తినడం సాధ్యమవుతుందా చెప్పండి. ఏదేమైనా ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది కూడా లిమిట్ లో తిన్నప్పుడే. కానీ మనలో చాలా మంది ఉప్పును మోతాదుకు మించి తినేస్తుంటారు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పును తగ్గించాలని హాస్పటల్ కు వెళ్లిన ప్రతిసారి డాక్టర్లు చెప్తూనే ఉంటారు.  

Also Read :- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఉప్పు  ఎక్కువుగా తింటే బీపీ తో పాటు పేగు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే దీనిన తగ్గించినా ప్రమాదమే.  అయితే పరిమాణం మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యాని హానికరం. సాధారణంగా టేబుల్​ సాల్ట్​... రాక్​ సాల్ట్​.. బ్లాక్​ సాల్ట్​ వాడతారు, అయితే ఆరోగ్య నిపుణులు పెద్దలను  6 గ్రాముల ఉప్పు.. పిల్లలు వారి వయస్సు ఆధారంగా 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు.  అంతకంటే ఎక్కువతింటే పేగు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. బీపీ (రక్తపోటు)తో బాధపడేవారు మోతాదుకంటె తక్కువుగానే తినాలి.    

అదనపు ఉప్పు యొక్క దుష్ప్రభావాలు

మనము తిన్న ఆహారం జీర్ణవ్యవస్థ ద్వారా ప్రేగులకు చేరుతుంది.  ఇక్కడి నుంచి పోషకాలు రక్తంలో కలుస్తాయి. ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకుంటే  సోడియం.. క్లోరైడ్​ అనే రెండు లవణాలు రక్తంలో కలుస్తాయి.  దీంతో హైపర్​ టెన్షన్​ ( బీపీ) ఏర్పడి గుండెపోటు.. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.   

ఉప్పును మోతాదుకు మించి తింటే గట్​ ఆరోగ్యంపై హానికర ప్రభావాన్ని చూపుతుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.  ఇందులో ఉండే బ్యాక్టీరియా రక్తంలో కలిసి.. పోషకాలను శరీరానికి అందకుండా చేస్తుంది.  దీంతో వ్యాధినిరోధక శక్తి తగ్గి.. అనేక వ్యాధులకు కారణమయ్యేఅవకాశం ఉంది.  ఇంకా గట్​ లైనింగ్​ దెబ్బతిని బ్యాక్టీరియా శరీరంలోని ఇతర భాగాల్లోకి ప్రవేశించి హాని కలిగిస్తుంది.  

ఎక్కువ ఉప్పు గ్యాస్ట్రిక్ మ్యూకోసా అని పిలువబడే గ్యాస్ట్రిక్ పొరను నాశనం చేస్తుంది. దీనిని పేగు మెటాప్లాసియా అంటారు. అలాగే అధిక ఉప్పు ఉంటే కడుపులో పెరిగే బ్యాక్టీరియాలో హెలికోబాక్టర్ పైలోరి ఒకటి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ బ్యాక్టీరియా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.  ఈ బ్యాక్టీరియా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆహారంలో ఉప్పును తగ్గించేందుకు చిట్కాలు..

  • డైనింగ్​ టేబుల్​పై ఉప్పును పెట్టవద్దు
  • ఛాట్​ మసాలా.. యాలకుల పొడి .. ఇతర మసాలా దినుసుల పొడిని ఉంచండి
  • రోజువారీ స్నాక్స్​ లో ఉప్పుకు బదులుగా  దాల్చిన చెక్క పొడి, నల్లమిరియాల పొడి, యాలకుల పొడిని వాడండి.  ఇవి రుచితో  పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. 
  • ఒకే సారి కాకుండా క్రమంగా ఉప్పు మోతాదును తగ్గించండి. 
  • ఫ్రెష్​ గా ఉండే ఫ్రూట్స్​.. కూరగాయలు తినండి.. ప్యాకింగ్​ చేసినా.. ప్రాసెస్​ చేసిన ఆహారపు పదార్దాల్లో ఉప్పు కలిపి ప్యాక్​ చేస్తారు.  కాబట్టి వాటికి దూరంగా ఉండండి