మాక్లూర్ మండలంలో సైబర్ నేరాలపై అవగాహన

మాక్లూర్, వెలుగు : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లూర్ ఎస్​ఐ ఎం. రాజశేఖర్ చెప్పారు. ఆదివారం మాక్లూర్ మండల కేంద్రంలోని ధర్మశాలలో కమ్యూనిటీ కాంటాక్ట్​ ప్రోగ్రాం నిర్వహించి సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, కొత్త చట్టాలపై అవగాహన కలిగించారు.

వివిధ రకాల నేరాల గురించి వివరిస్తూ ఆన్​లైన్​ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకుంటే 1930 టోల్​ఫ్రీ నెంబర్​కు కాల్​చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనీల్​ కుమార్ కులకర్ణి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వర్​ రావు గ్రామస్తులు పాల్గొన్నారు.