ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు. స్కూళ్లలో కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉట్టి కొట్టే కార్యక్రమాలు అలరించాయి. 

సరస్వతీ శిశుమందిర్​ విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం, రాధాకృష్ణ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, నిర్మల్​లోని మురళీకృష్ణ ఆలయాలకు భక్తులు భారీగా చేరుకొని పూజలు చేశారు. 

వెలుగు, నెట్​వర్క్