రంజీ ట్రోఫీలో సెంచరీతో దుమ్మురేపిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌

ముంబై: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (151 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రంజీ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఒడిశాతో బుధవారం ప్రారంభమైన ఎలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ సెంచరీతో చెలరేగాడు. దీంతో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ముంబై తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 90 ఓవర్లలో 385/3 స్కోరు చేసింది. శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సిద్ధేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (116 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లలో ఆయూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రే (18) ఫెయిలైనా, అంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఘువంశీ (92) వేగంగా ఆడాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజింక్య రహానె (0) డకౌటయ్యాడు. లాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 231 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేసి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నారు.