టైలరింగ్ శిక్షణతో ఉపాధి పొందాలి : ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి

బోధన్, వెలుగు: కుట్టు శిక్షణలో మహిళలు మెలకువలు నేర్చుకొని ఉపాధి  పొందాలని ఎమ్మెల్యే పి.సుదర్శన్​రెడ్డి సూచించారు. బుధవారం బోధన్​ పట్టణంలోని రాకాసిపేట్​లో నేషనల్​ అకాడమీ ఆఫ్​ కన్స్​క్షన్​ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్​లో శిక్షణ ఇచ్చారు. మూడు నెలల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న వారికి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు టైలరింగ్​శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.   అనంతరం భవన నిర్మాణ కార్మికులకు సామగ్రిని పంపిణీ చేశారు.  తర్వాత ప్రభుత్వ జూనియర్​ కాలేజీ ఆవరణలోని హైస్కూల్​ను సందర్శించారు.  

అక్కడ బాత్​రూమ్​లు, వంటగదిని పరిశీలించారు. వంటగదికి కావలసిన షెడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్​ పద్మావతి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్, గ్రంథాలయ చైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ డెలిగేట్​ గంగాశంకర్​, కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్​ వెంకట నారాయణ,   నాయకులు 
పాల్గొన్నారు.