నల్గొండ ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం

నల్గొండ అర్బన్, వెలుగు: నల్లగొండ జిల్లా పాత జడ్పీ ఆఫీసులోని జడ్పీ ఆడిట్ సెల్ ఆఫీసులో గురువారం అర్ధరాత్రి  షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కొన్ని ఫైల్స్, కంప్యూటర్లు కాలిపోయాయని, రూ.8 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఆడిట్ ఆఫీసర్​ కృపాకర్  తెలిపారు.

కాలిపోయిన ఫైల్స్ అన్నీ సిస్టమ్ లో భద్రంగా ఉన్నాయని, కాలిపోయినవి10 శాతం మాత్రమేనని చెప్పారు. గతంలో కూడా నల్గొండ విద్యాశాఖ ​ఆఫీసు, మున్సిపల్ ఆఫీసులో ఫైల్స్ కాలిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదాలకు షార్ట్ సర్క్యూటే కారణమా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.