స్టూడెంట్ల స్వచ్ఛ తా హీ సేవ

సదాశివనగర్, వెలుగు: సదాశివనగర్ మండలంలోని మర్కల్​ గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ తా హీ సేవా కార్యక్రమాన్ని గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్​ శోభారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె​ మాట్లాడుతూ.. మర్కల్​ గ్రామంలో నాలుగు రోజులపాటు 50 మంది స్టూడెంట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ ఒకరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో  వైస్​ ప్రిన్సిపాల్​శ్రావణి, ఉదయిని, పంచాయతీ సెక్రటరీ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. 

కామారెడ్డి టౌన్​, వెలుగు: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం  స్వచ్ఛ తా హీ సేవ పోగ్రాం నిర్వహించారు.  కాలేజీ ఆవరణలో ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరించారు.  ప్రిన్సిపాల్​ విజయ్​కుమార్​ మాట్లాడుతూ..  పర్యావరణానికి హాని కలిగించే  ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొట్టాలన్నారు.  ఎన్ఎస్ఎస్ పోగ్రాం ఆఫీసర్లు చంద్రశేఖర్​గౌడ్, వెంకటేశ్వర్లు, శారద, వలంటీర్లు పాల్గొన్నారు.