రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు

వేములవాడ​, వెలుగు : దక్షిణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధిలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి వారి కల్యాణమండపంలో 24 గంటలపాటు అఖండ భజన నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని, వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. రాజన్నను విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఈవో, అర్చకులు ఆయనకు ప్రసాదం అందజేశారు.  

చందుర్తిలో.. 

చందుర్తి, వెలుగు : చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. 24 గంటల పాటు భజనలు, సంకీర్తనతో కొనసాగాయి. భజన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసి వర్షాలు, సమృద్ధిగా కృషి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ భాస్కర్ శాలువాతో సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లరి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా భజనలో పాల్గొన్నారు. 

సుల్తానాబాద్, వెలుగు : సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం తో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పల్లా మురళి దంపతులు, భక్తులు హాజరయ్యారు.