టెక్నాలజీ ..వాట్సాప్​ ఛానెల్లో స్టిక్కర్ల షేరింగ్

ఈ ఏడాది మనదేశంతోపాటు150 దేశాల్లో వాట్సాప్ ఛానెల్స్​ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఛానెల్స్, ఇన్‌‌స్టాగ్రామ్ బ్రాడ్‌‌కాస్ట్ లాగా వన్-వే బ్రాడ్‌‌కాస్ట్ టూల్స్. అంటే.. కొంతమంది యూజర్లు మాత్రమే పెద్ద సంఖ్యలో మిగతా యూజర్లు అప్‌‌డేట్​లను షేర్ చేయగలరు. ఛానెల్ అడ్మిన్లు మాత్రమే ఛానెల్స్​లో మెసేజ్​లు పంపగలరు. ఇతర యూజర్లు ఆ మెసేజ్‌‌లకు రిప్లయ్ ఇవ్వొచ్చు. సెలబ్రిటీ, బిజినెస్ లేదా కంటెంట్ క్రియేటర్ల ఛానెల్‌‌ని వెతకడానికి డైరెక్టరీ నుంచి సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్ ఛానెల్స్ ద్వారా స్టిక్కర్‌‌లను కూడా వాడుకోవచ్చు.

వాట్సాప్ ఛానెల్ అడ్మిన్లు తమ ఫాలోవర్లతో స్టిక్కర్‌‌లను షేర్ చేసేందుకు అనుమతించే కొత్త బీటా అప్‌‌డేట్​ రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఇతర యూజర్లందరికి అందుబాటులోకి వస్తుంది. అప్‌‌డేట్ స్టాటిక్ స్టిక్కర్‌‌లను మాత్రమే కాకుండా యానిమేటెడ్, డైనమిక్ స్టిక్కర్‌‌లను కూడా సెండ్​ చేయొచ్చు. ఛానెల్స్​లో స్టిక్కర్‌‌లను షేర్ చేసేందుకు యూజర్లకు యాక్సెస్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే వాట్సాప్ బీటా వెర్షన్ అప్‌‌డేట్ చేయాలి. 

అందుకోసం సొంత ఛానెల్ ట్యాబ్‌‌కి వెళ్తే, ఎమోజీ కీబోర్డ్‌‌తో పాటు స్టిక్కర్స్​ ఆప్షన్ కనిపిస్తే..  ఫీచర్‌‌కి యాక్సెస్ ఉన్నట్టే. తర్వాత కొన్ని వారాల్లో ఈ ఫీచర్ మరిన్ని బీటా టెస్టర్‌‌లకు అందుబాటులోకి రానుంది. 

వాట్సాప్ ఛానెల్స్​లోని మెసేజ్‌‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌‌క్రిప్షన్ ప్రొటెక్షన్ లేదు. ఛానెల్ అడ్మిన్లు మాత్రమే అప్‌‌డేట్‌‌, మెసేజ్‌‌లను పోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఛానెల్ మెంబర్లు లేదా ఫాలోవర్లు ఆ మెసేజ్‌‌లకు రెస్పాండ్ అయ్యేందుకు వీలుంది. అన్ని మెసేజ్‌‌లు ఛానెల్‌‌లో మొదటిసారి షేర్ చేసినప్పటి నుంచి 30 రోజులు మాత్రమే కనిపిస్తాయి.