Sankranti Shopping : స్టయిలిష్గా షరారా

ట్రెడిషనల్ లుక్ లో ట్రెండీగా కనిపించాలంటే.. షరారా, ఘరారా డ్రెస్లు బెస్ట్ ఆప్షన్. ఈ రెండూ ఒకటే కదా అంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్టే. వీటి మధ్య డిఫరెన్స్ ఉంది? అదేంటంటే... షరారా డ్రెస్లు 16వ శతాబ్దంలోని మొఘల్స్ పాలన నుంచి ఉన్నాయి. ఇవి వెస్ట్రన్ ఏషియా దేశాల నుంచి అరబ్ ప్రాంతంలోకి అడుగుపెట్టాయి. ఆ తర్వాత మన దగ్గర పాపులర్ అయ్యాయి. అప్పట్లో రాణులంతా ఈ డ్రెస్ల వేసుకునేవాళ్లు. నడుం నుంచి పాదాల వరకు వెడల్పాటి ప్యాంటు ఈ స్పెషాలిటీ. 

ఘరారా విషయానికొస్తే ఉత్తర ప్రదేశ్ లోని అవధ్ రీజియన్ ఆడవాళ్లు 19 వ శతాబ్దంలోనే ఈ మోడల్ డ్రెస్లు వేసుకున్నారు. వెడల్పాటి ప్యాంటుకి మోకాలిపై నుంచి ఫిట్టింగ్ వస్తుంది ఈ డ్రెస్కీ.

అయితే కుర్తాని జత చేసి ఉండే ఈ డ్రెస్ డిజైన్లు పాపులర్ అయింది మాత్రం 80, 90 ల్లో వచ్చిన హిందీ సినిమాల ద్వారానే. ఆ తర్వాత కొంతకాలం కనిపించలేదు ఈ డ్రెస్లు. కానీ, ఇప్పుడు అకేషన్ ఏదైనా గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి. మెహంది, సంగీత్ ఫంక్షన్లకి బాగా నప్పుతాయి ఈ డ్రెస్లు. వీటి ధర వెయ్యి రూపాయలు నుంచి మొదలవుతుంది. హెవీ డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం మూడునాలుగు వేల వరకు ఖర్చు చేయాలి.