స్టార్టప్ : లగ్జరీ తెచ్చిన సక్సెస్​

మగ, ఆడ ఎవరైనా ఫుడ్ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది బ్యూటీకే. అదే గ్రూమింగ్ విషయానికి వచ్చేసరికి కొందరు మాత్రమే దానికి ప్రయారిటీ ఇస్తుంటారు. మిగతావాళ్లు దాన్ని డైలీ రోటీన్లా చూస్తుంటారు. ఆ ఆలోచన మార్చేసి, గ్రూమింగ్ ఒక లగ్జరీ పాస్ టైం అనుకునేలా చేయాలి అనుకున్నాడు శంతను దేశపాండే. అనుకోవడమే కాదు అందులో సక్సెస్ అయ్యాడు. అందుకే అతని కంపెనీ కూడా సక్సెస్ అయ్యింది.

శంతను దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే అమెరికాలోని డల్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టాడు. సొంతూరు మహారాష్ట్రలోని ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తండ్రి కిరణ్ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే అమెరికాలో పనిచేసేవాడు. కానీ.. శంతను పుట్టిన కొన్నాళ్లకు1997లో వాళ్ల కుటుంబం ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత శంతను పూణేలోని ‘విఖే పాటిల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో చేరాడు. ఆ తర్వాత నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ‘ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీ’లో బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఫైనల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతున్నప్పుడు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు క్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీమ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి చాలా పోటీ పరీక్షలు రాశాడు శంతను . చివరికి లక్నోలోని ఐఐఎంలో ఎంబీఏ చేశాడు. 

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే ఇష్టం 

చదువుకుంటున్న రోజుల్లోనే బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలనే ఆలోచన బలంగా ఉండేది శంతనుకు. ఎప్పుడూ పెద్ద పెద్ద కంపెనీలను, అవి తీసుకునే నిర్ణయాలను గమనిస్తుండేవాడు. లక్నోలో ఎంబీఏ పూర్తి చేశాక ‘మెకిన్సే’ అనే కంపెనీలో ఎక్స్​టర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ ఐదేళ్లు పనిచేశాక సొంత కంపెనీ పెట్టాలని డిసైడ్​ అయ్యాడు. ఆ ఆలోచన రావడంతో ఉద్యోగం మానేశాడు. అదే టైంలో న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గ్రూమింగ్ బ్రాండ్ ‘హ్యారీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఒక ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కలిశాడు. అప్పుడే అతనికి గ్రూమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ మీద ఆసక్తి పెరిగింది.

దానిమీద కొంత రీసెర్చ్ చేసి, ఆ తర్వాత కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. అప్పటికే జిల్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. అంతలా పోటీ ఉన్న మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలుదొక్కుకోవడం చాలా కష్టమని తెలిసినా ముందడుగు వేశాడు. చివరకు2016లో దీపూ పనికర్, రౌనక్ మునోత్, రోహిత్ జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలిసి ‘బాంబే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేవింగ్ కంపెనీ’ మొదలుపెట్టాడు. అప్పట్లో ఇండియాలో ఉన్న పరిస్థితులను బట్టి కంపెనీ నిలబడుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ.. వాళ్లు మాత్రం బలంగా నమ్మారు. 

బాంబే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేవింగ్ కంపెనీ

ఈ కంపెనీ ట్రిమ్మర్​, రేజర్​, షేవ్ కేర్, స్కిన్ కేర్, బాతింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్ముతోంది. ప్రీమియం ప్రొడక్ట్స్​ని డీ2సీ(డైరెక్ట్​ టు కస్టమర్) పద్ధతిలో అమ్ముతున్నారు. అంటే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తయారు చేసిన కంపెనీయే ఆ ప్రొడక్ట్​ని నేరుగా కస్టమర్లకు అమ్ముతుంది. మధ్యలో డీలర్లు, మధ్యవర్తులు ఉండరు. మొదట్లో మెన్స్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే అమ్మింది. ఆ తరువాత 2022లో ఆడవాళ్ల కోసం హెయిర్ రిమూవల్, పర్సనల్ కేర్ బ్రాండ్ ‘బాంబే’(BOMBAE)ని మొదలుపెట్టింది. అది కూడా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. బ్లేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  క్రీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనేందుకు కంపెనీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతి తీసుకొచ్చింది. ఈ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీ2సీ పద్ధతుల వల్లే కరోనా కష్టకాలంలో కూడా కంపెనీకి అంతగా నష్టాలు రాలేదు. 

సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇలా.. 

బాంబే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ పెట్టిన కొత్తలో ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు. కేవలం నోటిమాట(మౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పబ్లిసిటీ) వల్లే కంపెనీకి500 మంది వరకు కస్టమర్లు వచ్చారు. కంపెనీ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడిన వాళ్లు మరొకరికి రిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం వల్ల కొత్త కస్టమర్లు వచ్చారు. తర్వాత అనేక ఆఫర్స్​ ఇచ్చి కంపెనీ కస్టమర్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని వార్తాపత్రికలు, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో అడ్వర్టైజ్​మెంట్స్​ ఇచ్చారు. దాంతో సేల్స్ పెరిగాయి. 2016లో ఆరు వస్తువులతో ప్రారంభమైన కంపెనీ..  ఇప్పుడు షేవింగ్ బ్రష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టవల్​, ఫేస్ క్లెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రావెల్ ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షేవింగ్ క్రీమ్, పోస్ట్ షేవ్ బామ్స్​ వంటి ఎన్నో ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్ముతోంది. కంపెనీకి వచ్చే ఆదాయంలో దాదాపు 20 శాతం మాత్రమే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఛానెల్ నుంచి వస్తోంది. కంపెనీకి700 కంటే ఎక్కువ రిటైల్ కాంటాక్ట్ పాయింట్లు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 

ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రచారం

బాంబే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేవింగ్ కంపెనీ పెట్టిన ఆరువారాల తర్వాత ఫౌండర్స్ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్వర్టైజ్​మెంట్స్​ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలోని చాలా ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇచ్చారు. ఆ యాడ్స్ భిన్నంగా ఉండడంతో కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. అనేక పెద్ద బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటనలు ఇచ్చినట్టు కాకుండా శంతను కొత్తగా ఆలోచించాడు. అన్ని బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రముఖ అంబాసిడర్స్​ను పెట్టుకుంటాయి. కానీ.. బొంబాయ్ షేవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ అలాంటివేమీ చేయలేదు. ఇ–కామర్స్, సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేస్తోంది. అయితే ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరికీ చేరడంలేదనే ఉద్దేశంతో రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి కూడా అడుగుపెట్టింది. 

బిజినెస్ మోడల్

బాంబే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేవింగ్ కంపెనీ లక్ష్యం కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఆహ్లాదకరమైన, విలాసవంతమైన షేవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించడమే. అందుకే కంపెనీ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగింది. అంతేకాదు.. కంపెనీ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రొడక్ట్​ ప్యాకేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఒక కారణమే. షేవింగ్ కిట్స్​ ప్యాకేజింగ్ చాలా క్వాలిటీగా ఉంటుంది. వాటిని ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే డబ్బాలు కూడా ప్రీమియంగా ఉంటాయి. అందుకే చాలామంది కస్టమర్లు వాళ్ల అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్యాకింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు.

ఈ ప్రీమియం ప్యాకేజింగ్ ఆలోచన భారీ విజయానికి కారణమైందనే చెప్పాలి. ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కస్టమైజేషన్ లేదా పర్సనలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ఆ అవకాశాన్ని ఈ కంపెనీ కల్పించింది. కంపెనీ నుంచి ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనే కస్టమర్లు తమ పేర్లను మెటల్ బ్లేడ్స్​ మీద వేయించుకోవచ్చు. ఈ ఐడియా కూడా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక కారణమైంది. 

గిఫ్ట్స్ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సాధారణంగా మన దగ్గర గిఫ్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే కల్చర్ కాస్త ఎక్కువే. అందుకే దాన్ని కూడా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చుకుంది కంపెనీ. ముఖ్యమైన రోజులకు గిఫ్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇచ్చేందుకు బొంబాయ్ షేవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ ప్రత్యేకమైన ప్యాక్స్​ తెచ్చింది. పైగా ముఖ్యమైన ఈవెంట్స్ టైంలో ఈ ప్యాక్స్​ బాగా ప్రమోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటుంది. ‘ఫాదర్స్ డే, రాఖీ పండుగ’ లాంటి రోజుల్లో వీటి అమ్మకాలు బాగా పెరుగుతాయి. ఫాదర్స్ డే క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా చాలా అడ్వర్టైజ్​మెంట్స్​ చేశారు. దాంతో అమ్మకాలు పెరిగాయి. ఆ టైంలో వచ్చిన ప్రతి100 ఆర్డర్లలో దాదాపు 25 రేజర్లపై ‘DAD’ అని ప్రింట్ చేయించుకున్నారు.

వివాదంలో.. 

డిజిటల్ ప్రపంచంలో ప్రముఖుల్లో దాదాపుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. అలాగే శంతను కూడా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణ మూర్తిలాగే.. శంతను కూడా యువతలో వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి సోషల్ మీడియా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. 2022లో శంతను ‘ఫ్రెషర్స్​, యంగ్​ జనరేషన్​ కెరీర్ మొదట్లో రోజుకు18 గంటలు పని చేయాల’ని సలహా ఇచ్చాడు. దాంతో ‘టాక్సిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ని ప్రోత్సహిస్తున్నాడని శంతనును నెటిజన్లు తెగ విమర్శించారు. 

సవాళ్లు ఎన్నో...

లగ్జరీ: రోజువారీ విధిగా షేవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడిన వాళ్లను ‘గ్రూమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనేది ఒక లగ్జరీ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైం’ అని ఒప్పించడం చాలా కష్టమైంది. ఎందుకంటే.. వీళ్లు అమ్మే గ్రూమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలావరకు ఖరీదైనవే. కొన్ని షేవింగ్ కిట్లు ఏకంగా 3,000 రూపాయల వరకు అమ్ముతోంది. 

లాజిస్టిక్స్: కంపెనీ ప్రారంభించినప్పుడు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్యాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే ప్రొడక్ట్స్ మీద కస్టమర్లకు నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను గట్టిగా తయారుచేయించారు. ఆ తర్వాత డెలివరీ కోసం సప్లయ్​ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుచేసుకున్నారు.

లాభాలు

బొంబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేవింగ్ కంపెనీ మొదటి ఏడాదిలో నెలకు సగటున18 లక్షల రూపాయలు రాబట్టింది. మరుసటి ఏడాది నెలకు30 లక్షల రూపాయలకు పెరిగింది. 2018లో కంపెనీ టర్నోవర్ దాదాపు 5 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2020లో కరోనా ప్యాండెమిక్​ రోజుల్లో కూడా 17.6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ.. ఆ తర్వాత ఆశించిన లాభాలు రాలేదు. ఇప్పుడు వ్యాపారం మళ్లీ పుంజుకుంది.