పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం : షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో టీజీవో, టీఎన్జీవో సంఘాల  డైరీ, క్యాలెండర్లను షబ్బీర్​అలీ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. 

గత ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిందని, ఈ జీవో ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు సబ్​కమిటీ వేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, ఈ నెల 27న మరో రెండింటిని అమలు చేయబోతున్నామన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.  ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ALSO READ : ఎన్టీఆర్ నేర్పిన సంస్కారంతో పనిచేస్తున్నాం : తుమ్మల నాగేశ్వరరావు

టీజీవో, టీఎన్జీవోల బిల్డింగుల​నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. షబ్బీర్​అలీని ఎంప్లాయీస్​ అసోసియేషన్​ ప్రతినిధులు, ఆయా శాఖల ఆఫీసర్లు సన్మానించారు.  కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్, టీజీవో స్టేట్​ ప్రెసిడెంట్​ మారం జగదీశ్వర్, టీజీవో జిల్లా ప్రెసిడెంట్, సెక్రెటరీలు దేవేందర్, సాయిరెడ్డి, టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, సెక్రెటరీలు వెంకట్​రెడ్డి, సాయిలు, ప్రతినిధులు అలుక కిషన్, శ్రీనివాస్​రెడ్డి,  దయానంద్​తదితరులు పాల్గొన్నారు.