ఫీజ్రీయింబర్స్మెంట్ విడుదలచేయాలని..ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఎస్ఎఫ్ఐ వినతి పత్రం

మంచిర్యాల : పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలని బెల్లంపల్లి బజార్ ఏరియా నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు  ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతి పత్రం అందజేశారు. ఎస్ ఎఫ్ ఐ నేతల వినతిపై సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే వినోద్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థి సంఘల నేతలకు  హామీ ఇచ్చారు. 

ALSO READ | పవర్ ఇంజినీర్స్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల