మహిళలపై లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరం : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు : పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరమని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్​లో డీడబ్ల్యూవో శాఖ ఆధ్వర్యంలో అడిషనల్​కలెక్టర్​ రోహిత్​ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్పెషల్​డిప్యూటీ కలెక్టర్​ సుహాసినితో కలిసి పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 మహిళా సాధికారత, నషా ముక్త్​ భారత్​ అభియాన్​లో భాగంగా మిషన్​పరివర్తన కింద మాదకద్రవ్యాల నిరోధ చట్టం, బాల కార్మిక చట్టం, పోక్సో యాక్ట్​లపై జిల్లా, మండల అధికారులు, మహిళా ఉద్యోగులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

కలెక్టర్​ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్​అన్ని శాఖల ఆఫీస్​ల్లో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్​ కంఫ్లైంట్​ కమిటీ (ఐసీసీ) లను ఏర్పాటు చేయాలన్నారు. హెల్ప్​లైన్​నంబర్​ 181లో కూడా ఫిర్యాదుల కొరకు సంప్రదించాలని వెల్లడించారు. మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకోసం నషా ముక్త్​ భారత్​ లో భాగంగా మిషన్​ పరివర్తన కింద ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం బీబీఏ స్టేట్​ కోఆర్డినేటర్​ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్​మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, మాదక ద్రవ్యాల నిరోద చట్టం పై అవగాహన కల్పించారు. అంతకుముందు కలెక్టర్​ అన్ని మండలాల తహసీల్దర్లతో సోలార్​ పవర్​ ప్లాంట్, ధరణి పెండింగ్​లు తదితర అంశాలపై గూగుల్​ మీట్​ ద్వారా సమీక్ష నిర్వహించారు.