వాహనదారులు నిబంధనలు పాటించాలి : ఎంవీఐ మనోహర్

అశ్వారావుపేట/పెనుబల్లి/పాల్వంచ, వెలుగు: వాహనదారులు, పాదచారులు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పలువురు మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్లు సూచించారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అశ్వారావుపేట ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ లో ఎంవీఐ మనోహర్, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఎంవీఐ రాజశేఖర్, పాల్వంచ పట్టణంలోని ఆటో ట్రాలీ యూనియన్ అడ్డా వద్ద ఎంవీఐ భీమ్​సింగ్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. 

మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, డ్రైవింగ్​లో సెల్ ఫోన్ మాట్లాడొద్దని సూచించారు.  వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు.