ఈ 7 వదిలేస్తే... సంతోషం మీ సొంతం!

ఏ మాత్రం ఉపయోగపడని కొన్ని అలవాట్లు ఉంటాయి. అలాగని వాటిని వదులుకోవాలని ఎంత ప్రయత్నించినా వదిలిపెట్టడం కష్టం అవుతుంది. దాంతో వాటిని వదల్లేక, వాటివల్ల ఎదురయ్యే ఒత్తిడి ని తట్టుకోలేక జీవితాన్ని ఎంజాయ్​ చేయలేని వాళ్ల సంఖ్య ఎక్కువే. సంతోషానికి గండి పెట్టే అలాంటి అలవాట్లు మరీ ముఖ్యంగా ఓ ఏడు ఉన్నాయి. వాటిని వదిలేశారంటే కచ్చితంగా ఎక్కువ సంతోషంతో బతికేయొచ్చు. ఆ ఏడు అలవాట్లు, వాటిని వదిలించుకునేందుకు ఏం చేయాలనేదే ఈ స్టోరీ.

చుట్టుపక్కల వాళ్లతో పోల్చుకోవడం

అలాకాకుండా మిమ్మల్ని స్పెషల్​గా ఉంచే వాటి గురించి ఆలోచించాలి. ‘‘ఇతరుల మీద ఫోకస్​ పెట్టే బదులు ఎవరికి వాళ్లు, వాళ్ల మీద ఫోకస్​ పెట్టుకోవాలి. దానివల్ల ఒత్తిడి​, ఆందోళనలను తగ్గించుకోవచ్చు. సంతోషంగా ఉండి, ఆత్మస్థైర్యం పెంచుకుని జీవితానికో అర్థం ఉండేలా బతకాలి’’ అని సైకాలజిస్ట్​లు చెప్తున్నారు. మీలోని బలాలు, సాధించిన విజయాలు (అది ఎంత చిన్నదైనా కావచ్చు) సెలబ్రేట్​ చేసుకోవాలి. ఎవరి మెప్పో పొందాలని, అవతలి వాళ్లెవరో గమనించాలని కాకుండా మనసుకు సంతోషాన్నిచ్చే పనులు చేయాలి. ఇలా ఆలోచించడం ఎప్పుడైతే మొదలుపెడతారో అప్పట్నించీ ఒత్తిడి, ఆందోళనలు దరిచేరవు.

ప్రతీది నెత్తిన వేసుకోవద్దు

ప్రతినిధిగా ఉండాలి అంతేకానీ అన్నీ నేనే చేస్తా అనుకోవద్దు. అది పని చేసే దగ్గర పెద్ద ప్రాజెక్ట్ వర్క్​​ కావచ్చు లేదా ఫ్యామిలీ రీయూనియన్​ ప్లానింగ్​ కావచ్చు. ఏ పనైనా సరే ఒక్కరే అన్ని పనులు నెత్తి మీద వేసుకోవద్దు. తలా ఒక పని చేసేలా ప్లాన్​ చేయాలి. వర్క్​ డివిజన్​ జరిగితే ఒత్తిడి, ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు అందరూ కలిసి పనిచేయడం వల్ల వచ్చే రిజల్ట్​ చాలా బాగుంటుంది.

డిసప్పాయింట్​ చేసిన వాళ్లను ట్రాక్​ చేయడం మానేయాలి

కొత్త ప్లాన్​ - ఎవరు వస్తున్నారో గమనించాలి.

ఏవో పరిస్థితుల వల్ల మానసికంగా డౌన్​​లో ఉన్నప్పుడు లేదా ఫంక్షన్​కి పిలిస్తే  ఫ్రెండ్స్​ రాకపోతే...  ఆ విషయం మనసును చాలానే ఇబ్బంది పెడుతుంది. అలాగని ‘‘వాళ్లు ఎందుకు రాలేదు? నన్ను ఎవాయిడ్​ చేస్తున్నారా?’’ అని ఆలోచిస్తూ కూర్చుంటే మైండ్​ మీద భారం, మనసుకి కష్టం తప్ప ఒరిగేదేం ఉండదు. ఇలాంటప్పుడే  ‘‘గ్లాసులో నీళ్లు సగమే ఉన్నాయని ఆలోచిస్తున్నారా? లేదంటే  సగం గ్లాస్​ నిండుగా ఉంది అనుకుంటున్నారా” గమనించాలి. 

అంటే అంతా ఆలోచనా విధానంలోనే ఉందన్నమాట. అందుకని బ్రెయిన్​ మీద భారం వేసే ఆలోచనలను కట్టిపెట్టి ప్రతి రోజు మీరు ఏ విషయం పట్ల థ్యాంక్​ఫుల్​గా ఉన్నారో చూసుకోవాలి. వాటి గురించి ఒక నోట్​బుక్​లో కొన్ని పదాల్లో లేదా వాక్యాల్లో రాయాలి. సమాజంలో నలుగురితో ఉండే సంబంధాలు బాగుండాలి. అలాగే ఆత్మ స్థైర్యం ఎప్పుడూ కోల్పోకూడదు. దానివల్ల జీవితకాలం పెరుగుతుంది.

పదే పదే మొబైల్​ ఫోన్​ చెక్​ చేస్తున్నారా

అలా చేస్తుంటే కనుక టైం పెట్టుకుని మరీ బ్రేక్స్​ తీసుకోవాలి. ముఖ్యంగా ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫోన్​ దగ్గర పెట్టుకోవద్దు. అలాగే​ తినేటప్పుడు కూడా. ఆన్​లైన్​లో ఎంత టైం ఉంటున్నారనే విషయం మీద ఫోకస్​ పెట్టాలి. ఎక్కువ టైం సోషల్​ మీడియాలో ఉండడం వల్ల డిప్రెషన్​, యాంగ్జైటీల బారిన పడడం ఖాయం. మెడిటేషన్​ చేసి ఎమోషన్స్​ అదుపులో ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే ఎమోషన్స్​ అదుపులో ఉంటాయో అప్పుడు మీతో పాటు పక్క వాళ్లు కూడా సంతోషంగా ఉంటారు.

హ్యాపీనెస్​ కోసం షాపింగ్ చేయడం

వెకేషన్​కి ఒక టూర్​ వేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు కొందరు. ఇంకొందరేమో బరువు తగ్గితే చాలు... దాన్ని మించిన ఆనందం మరోటి లేదు అనుకుంటుంటారు. ఇలాంటి వాటి వెంట పరిగెత్తడం ఎనర్జీ వేస్ట్​ పని అంటున్నారు మానసిక నిపుణులు. సంతోషం అనేది బయటి విషయాల వల్ల వస్తుంది అనుకోవడం సహజం. కానీ అలా వచ్చిన సంతోషం చాలా త్వరగా చెరిగిపోతుంది. మనసు పూర్తి ఆనందంతో నిండిపోవాలి, ఆ ఆనందం ఎక్కువకాలం ఉండాలంటే... ఫలితాన్ని కళ్లముందు నిలిపే పనులు చేయాలి. ఉదాహరణకి స్కూల్​కి వెళ్లలేని పిల్లలకు చదువు చెప్పొచ్చు. ఇలాంటి పనుల వల్ల  మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇది కొన్ని రోజుల్లో చెరిగిపోయే ఆనందం కూడా కాదు. ఈ ఆనందం లైఫ్​స్పాన్​ చాలా ఎక్కువ. ట్రే చేసి చూడండి.

ఎక్కువగా ఆలోచించడం

పూర్వం రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో అతిగా ఆలోచించే వాళ్ల సంఖ్య బాగా పెరిగిందనే చెప్పాలి. దానివల్ల చిన్న విషయాలకే విపరీతమైన చిరాకు పడుతున్నారు. మన చేతిలో లేని, మార్చలేని విషయం గురించి తెగ ఆలోచిస్తే ఏమొస్తుంది? తలనొప్పి తప్ప! అందుకే అలాంటి వాటిని పట్టుకుని వేలాడుతున్నామా అనేది గమనించుకోవాలి. అలా చేస్తున్నాం అనిపిస్తే... ఆ ఆలోచన నుంచి బయట పడేందుకు సినిమా లేదా పార్క్​కి వెళ్లడం వంటివి చేయాలి.​

మనోవేదన కలిగించిన విషయాలను పట్టుకుని ఉండటం

అలాంటి వాటిని వదిలేయాలి. కొలీగ్​ మిమ్మల్ని కావాలని పట్టించుకోనట్టు బిహేవ్​ చేస్తున్నా లేదా పక్కింటి వాళ్లు మీ గురించి చెడుగా మాట్లాడారని తెలిసినా.... ఇలాంటి విషయాలు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటే మనసు బాధపడుతుంది. భారంగా మారుతుంది. అంతేకాదు కోపం, ఆలోచనల వల్ల బ్లడ్​ ప్రెషర్​ పెరుగుతుంది. దానివల్ల కరోనరీ హార్ట్​ డిసీజ్​లు బారిన పడే ఛాన్స్​ ఉంది. అందుకే క్షమించేయాలి. ఇలా చేయడం వల్ల హెల్దీ రిలేషన్స్​ ఏర్పడతాయి. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. బహుశా మీ కొలీగ్​కి తన వర్క్​ పట్ల ఇన్​సెక్యురిటీ ఉందేమో! పక్కింటి వాళ్లు ఏ విషయంలోనైనా ఒత్తిడితో ఉన్నారు కాబోలు... అందుకే వాళ్లలా ప్రవర్తిస్తున్నారేమో. అందుకే అలాంటి విషయాలను పట్టించుకోవద్దు. నిజానికి అది అవతలి వాళ్ల సమస్య... నాది కాదు అనుకుంటే  ఫ్రెష్​ స్టార్ట్​ చేయొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు.