రిటైర్డ్​ ఎంప్లాయీస్​ సేవలు అభినందనీయం : కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్, వెలుగు : సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో  జిల్లా రిటైర్డ్​ ఎంప్లాయీస్​సేవలు అభినందనీయమని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పదో తరగతిలో 10 జీపీఏ  సాధించిన  10 మంది విద్యార్థులకు రిటైర్డ్​ ఎంప్లాయీస్​ సంఘం ఆధ్వర్యంలో  శనివారం ఒక్కోక్కరికి రూ.5 వేల నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ఉద్యోగులుగా రిటైర్డ్​ అయినప్పటికీ  సామాజిక సేవలు నిర్వహిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో డీఈవో రాజు, యూనియన్ జిల్లా ప్రెసిడెంట్​ నిట్టు విఠల్​రావు,  సెక్రటరీ గంగాగౌడ్, ట్రెజరర్​ మల్లేశం,  ప్రతినిధులు ఉపేందర్​,  విశ్వనాథం  సలావుద్దీన్,  శ్యాంరావు,  నాగగౌడ్, అర్జున్​రావు, నర్సయ్య,  చక్రపాణి, బాల్​రెడ్డి, నారాయన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.