సొంతూరుకు జీవీ మృతదేహం.. 9న ఖతార్ లో మృతి

  • స్వగ్రామానికి వలస జీవి డెడ్​బాడీ

  • ఫ్రీ అంబులెన్స్  అందించిన సర్కార్

కొడిమ్యాల, వెలుగు: ఈ నెల 9న ఖతార్ లో గుండె పోటుతో చనిపోయిన యువకుడి డెడ్ బాడీ మంగళవారం స్వగ్రామం చేరుకుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి విలేజ్ కి చెందిన కంకణాల శ్రీకాంత్(27) ఉపాధి కోసం ఖతార్ కు వెళ్లాడు. ఈ నెల 9న డ్యూటీ అనంతరం వాకింగ్  చేస్తుండగా, గుండెపోటుతో చనిపోయాడు. కాగా, శ్రీకాంత్  డెడ్​బాడీ మంగళవారం నాచుపల్లికి చేరుకోగా, కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు హైదరాబాద్  ఎయిర్ పోర్ట్​ నుంచి నాచుపల్లి వరకు ప్రభుత్వం ఉచిత అంబులెన్స్  సౌకర్యం కల్పించింది. గల్ఫ్  వర్కర్స్  కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కీం ద్వారా రూ.5 లక్షల సాయాన్ని శ్రీకాంత్  కుటుంబానికి అందజేసి ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.