ఇక సెలవు.. ముగిసిన డి.శ్రీనివాస్ అంత్యక్రియలు 

నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ (75) నిజామాబాద్ పట్టణంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు ఆదివారం (జూన్ 30) మధ్యాహ్నం ముగిశాయి. అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం.డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డీఎస్ చిన్న కుమారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, కుటుంబ సభ్యులు డీఎస్ కు కన్నీటీ వీడ్కోలు పలికారు. 

డీఎస్ ను చివరిచూపు చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువుల భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకు ముందు నిజామాబాద్ లోని డీఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహానికి నివాళుర్పించారు. డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో డీ. శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు .డీఎస్ ఎంతో మంది బలహీనవర్గాలను గుర్తించి అవకాశాలు ఇచ్చారని కొనియాడారు.

40 యేండ్లపాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డీ.శ్రీనివాసును సన్నిహితులు, నేతలు,కార్యకర్తలు  డీఎస్ గా, శీనన్నగా పిలిచేవారు. బీసీ నేతగా, తెలంగాణ వాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందారు డీఎస్. నిజామాబాద్ జిల్లా, వేల్పుూర్ మండల  కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 జన్మించారు డీ.శ్రీనివాస్. 

హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ , లా పూర్తి చేసిన డీఎస్.. రిజర్వాు బ్యాంకులో పనిచేశారు. ఆ టైమ్ లో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపు తో ఎన్ ఎస్ యూఐ లో చేరారు డీఎస్. 

డీఎస్ లోని నాయకత్వ లక్షణాలను గ్రహించిన ఇందిరాగాంధీ.. ఆయనను ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ ఎస్ యూఐ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అక్కడినుంచి ప్రస్థానం ప్రారంభించిన డీఎస్.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడ ఏపీ పీసీసీ ఉపాధ్యాక్షుడిగా, జనరల్ సెక్రటరీ గా , రెండుసార్లు పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు.