ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి :  బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు  డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా సుగుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చెయాలని కోరారు. 


జగిత్యాల టౌన్/ సిరిసిల్లటౌన్​, వెలుగు: జగిత్యాల, సిరిసిల్లలో ఎస్​ఎస్​ఏ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. జగిత్యాలలో ఉద్యోగులు పాతబస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి తమకు ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీని నెరవేర్చాలని నినాదాలు చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సిరిసిల్లలో కలెక్టరేట్​ ఎదుట నిరవధిక సమ్మెకు దిగారు.