శ్రీచేతన స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు

నార్కట్​పల్లి, వెలుగు : నార్కెట్ పల్లి పట్టణంలోని శ్రీచేతన స్కూల్​లో సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేవదూతలు, శాంతాక్లాజ్​ వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుచ్చకాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ భగవంతుడి బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ జీవించాలని సూచించారు. క్రిస్మస్ వేడుకలను ప్రపంచ ప్రజలందరూ సంతోషంగా జరుపుకొంటారని తెలిపారు.