సెల్ఫ్​ డిఫెన్స్​లో ఇందూర్​ రికార్డ్..సెల్ఫ్​ డిఫెన్స్​లో ఇందూర్​ రికార్డ్

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ ​సిటీలో ఆదివారం ఏకకాలంలో 11 వేల మంది యువత, మహిళలకు సెల్ఫ్ ​డిఫెన్స్ పై ట్రైనింగ్​ఇవ్వగా, లిమ్కా బుక్​ఆఫ్ రికార్డులో నమోదైంది. లీగల్ ​సర్వీసెస్​అథారిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్​ గిరిరాజ్ ​డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో ఈ ప్రోగ్రామ్​ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తైక్వాండో  కోచ్ మనోజ్ ​ట్రైనింగ్​ఇచ్చారు. వారం రోజుల నుంచి ప్రచారం నిర్వహించడంతో బాలికలు, యువతులు, మహిళలు భారీగా వచ్చారు.

లిమ్కా బుక్ ​ఆఫ్​ రికార్డ్స్​ ప్రతినిధుల సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటి వరకు ఏకకాలంలో 7 వేల మందికి మాత్రమే ట్రైనింగ్ ​ఇవ్వగా, తాజాగా ఇందూరులో ఈ రికార్డును అధిగమించినట్లు తమ రికార్డులో నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ ​అందజేశారు. స్టేట్ ​లీగల్​అథారిటీ సెక్రెటరీ ఎస్.గోవర్ధన్​రెడ్డి, సీపీ కల్వేశ్వర్​సింగన్​వార్, జీజీహెచ్​ హాస్పిటల్​ సూపరింటెండెంట్​డాక్టర్​ ప్రతిమారాజ్​ తదితరులు పాల్గొన్నారు.