కామారెడ్డి జిల్లాలో ఎండు గంజాయి పట్టివేత

సదాశివనగర్, వెలుగు :  కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలం వజ్జపల్లి, యాచారం గ్రామాల్లోని ఇరువురి ఇళ్లలో జరిపిన సోదాల్లో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్​సీఐ విజయ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జిల్లా ఎక్సైజ్​అధికారి హన్మంతరావు ఆదేశాల మేరకు వజ్జపల్లిలో  కామిండ్ల రాజశేఖర్ ఇంటిలో  సోదా చేయగా70  గ్రాముల ఎండుగంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. 

నిందితుడిని విచారించగా యాచారం గ్రామానికి చెందిన తిరుపతి నుంచి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.  తిరుపతి ఇంటిలో సోదా చేయగా 70 గ్రాముల గంజాయిలభించిందన్నారు. మొత్తం 140 గ్రాముల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.