జగిత్యాల జిల్లాలో.. మద్యం బాటిల్లు ధ్వంసం

జగిత్యాల టౌన్, వెలుగు: మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న బాటిళ్లను రోడ్డు రోలర్ తో పోలీసులు ధ్వంసం చేశారు. ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం రవాణా పై 108 కేసులను నమోదు చేయగా.. సుమారు 6లక్షల విలువ గల 2019.57 లీటర్ల బాటిళ్లను స్వాధీనం చేసుకొని, ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చంధర్, ధర్మపురి సీఐ రామ్ నర్సింహా రెడ్డి, ఎక్సైజ్ మహేంద్ర సింగ్, ఎస్సైలు సతీశ్​, ఉమ సాగర్ సిబ్బంది పాల్గొన్నారు.