రాష్ట్ర జనాభాలో మాలలది రెండో స్థానం

  • 30 లక్షల మంది ఉన్నా చులకనగా చూస్తున్నరు: వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సభతో మాలలు సత్తా చాటాలి
  • జాతి ఐక్యత కోసం జిల్లాల్లో పర్యటిస్తుంటే కొందరు విమర్శిస్తున్నరు
  • తెలంగాణ వచ్చే దాకా కొట్లాడిన వాడ్ని.. ఇలాంటి వాటిని లెక్కచేయను
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో మాల ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో చెన్నూరు ఎమ్మెల్యే

నిజామాబాద్/కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది ఉన్నారని, స్టేట్ జనాభాలో రెండో స్థానంలో ఉన్నా మాలలను తక్కువ చేసి చూపుతూ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇదే విషయాన్ని తాను ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాకు వివరించానని తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మాల ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తాను సీఎం రేవంత్ రెడ్డిని కలసి మాట్లాడానని, తాను కలిశాకే వర్గీకరణ అంశంపై కమిటీ వేశారని గుర్తుచేశారు. మాలల ఐక్యతతో రాజకీయ పార్టీలకు తడాఖా చూపించాల్సిన టైం వచ్చిందన్నారు. జాతి మొత్తాన్ని ఒక వేదికపైకి తేవడానికి జిల్లాల్లో జరిగిన సభలు సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యాయని, డిసెంబర్​ 1న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే సభతో మాలలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జాతి ఐక్యత కోసం తాను జిల్లాల్లో పర్యటిస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అన్ని వర్గాల నాయకుడిగా ఉండాలి కానీ.. మాల నేతగా ఎందుకు వెళ్తున్నారంటూ వెనక్కులాగే ప్రయత్నం చేస్తున్నారని, వారి విమర్శలను సంతోషంగా స్వీకరించి ముందుకెళ్తున్నానని చెప్పారు. మాలలకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయని అది చూసి ఈర్ష్య పడేవారి సంఖ్య పెరిగిందన్నారు. కులవివక్ష కారణంగా ఏసీబీ రైడ్స్ 90 శాతం వరకు మాల ఉద్యోగులపైనే జరుగుతున్నాయని, పెద్ద కాంట్రాక్టర్లను ఎవరూ ముట్టుకోవడం లేదని ఆరోపించారు. 

ఈడీ, ఐటీ రైడ్స్​ చేసినా భయపడలేదు..

ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా లక్ష్యం సాధించేదాకా తగ్గలేదని వివేక్ అన్నారు. ఈడీ, ఐటీ రైడ్స్‌‌‌‌‌‌‌‌తో తనను భయపెట్టడానికి ప్రయత్నించారని, కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టినా లెక్క చేయలేదన్నారు. 

ఉద్యమ టైంలో ప్రజల గొంతుకను పాలకులకు వినిపించడానికి వీ6 చానల్ ప్రారంభించానని, సీఎం కేసీఆర్ హయాంలో అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొన్నా మడమ తిప్పలేదని గుర్తుచేశారు. పోరాటం చేయడాన్ని తన తండ్రి కాకా వెంకటస్వామి నుంచి నేర్చుకున్న వ్యక్తినని.. ఏ స్థాయి ఒత్తిళ్లూ తనపై పనిచేయవన్నారు. ఇప్పుడు ప్రమాదంలో పడ్డ స్వజాతి ప్రయోజనాలు నెత్తినెత్తుకున్నానన్నారు. 

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ, జాతి ఐక్యత కోసం ఎమ్మెల్యే వివేక్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన మాలల ప్రయోజనాన్ని విస్మరించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ అలుక కిషన్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మామిడి నారాయణ, రాంచందర్, మారయ్య, కాంబ్లే, ఎల్లమయ్య, గైని గంగారాం, నర్సింగ్ రావు, రాజు, సురేందర్, సుశీల్, అమృత్, దేవీదాస్ తదితరులు ఉన్నారు.

మాలలకు గుర్తింపు రావడం లేదు.. 

రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నా సరైన ప్రాధాన్యత లేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, దీంతో రావాల్సిన గుర్తింపు రావడం లేదని ఆరోపించారు. 

ఎస్సీల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ భద్రాచలం నుంచి చేపట్టిన పాదయాత్ర ఆదివారం మానకొండూరు మీదుగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. మానకొండూరులో నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలల ఐక్యత చాటేందుకు నాగర్ కర్నూల్‌‌‌‌‌‌‌‌, వరంగల్, కరీంనగర్, గోదావరి ఖని, ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ఆత్మ గౌరవ సభలు సక్సెస్ అయ్యాయని గుర్తుచేశారు. 

మాలల సమస్యల కోసం ఎక్కడ సభ జరిగినా పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు పిల్లి సుధాకర్ చేపట్టిన యాత్ర సక్సెస్‌‌‌‌‌‌‌‌ అవ్వాలని ఆకాంక్షించారు. మరోవైపు, మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలో జ్యోతక్క అంతక్రియలకు ఆయన హాజరై, ఆమె పార్థివదేహానికి పూలు వేసి నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి