- ప్రజాస్వామ్యానికి ఇది పండుగ
- జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలపై సీఈసీ
- రెండో దశలో 54శాతం పోలింగ్
- 6 జిల్లాల్లో ఓట్లేసిన జనం
- బరిలో ఒమర్ అబ్దుల్లా సహా 238 మంది నేతలు
శ్రీనగర్:జమ్మూకాశ్మీర్‌లో రెండో దశ పోలింగ్ పటిష్ట బందోబస్తు నడుమ బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 6 జిల్లాల్లో 26 నియోజకవర్గాల్లోని 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. 13 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పీర్పంజాల్పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గందర్బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు సాగింది.
ప్రజలు క్యూలైన్లో నిల్చొని, ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 54% ఓటింగ్నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటేయడానికి క్యూలలో నిలబడ్డ జనాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యానికి ఇది పండుగలా అనిపిస్తోందంటూ సీఈసీ రాజీవ్ కుమార్ కామెంట్ చేశారు.
కాగా, ఈ రెండో ఫేజ్‌లో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్రైనా, పీసీసీ అధ్యక్షుడు తారిఖ్హమీద్ కర్రాసహా 238 మంది నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వచ్చే నెల ఒకటిన మిగతా 40 స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కాను న్నాయి.
ఎన్నికల ప్రక్రియ పరిశీలించిన విదేశీ ప్రతినిధులు
జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించేందుకు 15 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారు. అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జోర్గాన్ ఆండ్రూస్నేతృత్వంలో విదేశీ మంత్రిత్వశాఖకు చెందిన ఆరుగురు అధికారులతో కలిసి ప్రతినిధి బృందం ఉదయం 10 గంటలకు శ్రీనగర్‌కు చేరుకున్నది.
ఈ బృందంలో అమెరికాతోపాటు ఈయూ, సౌత్‌కొరియా, స్పెయిన్, సోమాలియా, పనామా, నైజీరియా, సౌత్ఆఫ్రికా, నార్వే, రువాండా, ఫిలిప్పీన్స్, మెక్సికో, సింగపూర్, టాంజానియా ప్రతినిధులున్నారు.
శ్రీనగర్, బుద్గాం జిల్లాలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఓటర్లతో ముచ్చటించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్టు సీనియర్ అధికారి తెలిపారు. మరో రెండ్రోజులు వివిధ చోట్ల పర్యటించనున్నారు.
ఈ ఎన్నికలు ఓ చరిత్ర
జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు చరిత్రను సృష్టిస్తున్నాయని చీఫ్ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎక్కడైతే ఎన్నికలను బహిష్కరించారో..అదేచోట ఇప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో నిల్చొని, తమ ఓటుహక్కును వినియోగించుకుం టున్నారని చెప్పారు. యువత, మహిళ లు, సీనియర్ సిటిజన్లు కూడా ఓటేసేందు కు ఓపికతో క్యూలైన్లో నిల్చొన్నారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యా నికి పండుగ రోజు అని అభివర్ణించారు.