సీజనల్​ ఫీవర్స్​.... ఏ జ్వరాన్ని ఎలా గుర్తించాలి..

వానాకాలం అంటే జల్లులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో చుట్టూ ఉన్న పరిసరాలు ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు పెరగడానికి అనువుగా ఉంటాయి. దీంతో సీజనల్‌ వ్యాధులు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుంటాయి. ప్రత్యేకించి ఈ మధ్య స్వల్ప విరామంతో అడపాదడపా కురుస్తున్న వానలతో దోమల వృద్ధి పెరిగింది. దీంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా లాంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు,దగ్గు, జ్వరం పీడిస్తున్నాయి..  సీజనల్​ ఫీవర్స్​ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. . .

తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

టైఫాయిడ్ జ్వరాన్ని ఎట్లా గుర్తుపట్టాలి?

మామూలు వారం రోజు రోజుకీ తగ్గుతుంది. టైఫాయిడ్ జ్వరం పొద్దున తక్కువుగా ఉంటుంది. సాయంత్రానికి బాడీ చెంపరేచర్​ పెరుగుతుంది. రాత్రికల్లా హైటెంపరేచర్ కు చేరుకుంటుంది. ఒళ్లు నొప్పులు, పొట్టలో నొప్పి ఉంటాయి. టైఫాయిడ్ వస్తే బాడీ టెంపర్ చర్ పెరుగుతూ ఉంటుంది. కానీ తగ్గదు ఈ లక్షణం ఆధారంగా జ్వరాన్ని టైఫాయిడ్ గా అనుమానించాలి

బైఫాయిడ్ ఎందుకొస్తుంది?

మనం తినే ఆహారం. తాగే నీళ్లు కలుషితం కావడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువ కలుషిత నీటిలో సాల్మొ నెల్లా బ్యాక్టీరియా ఉంటుంది.సాల్మొ నెల్లా బ్యా క్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే ..... చర్మంపై ఎర్రని మచ్చలు (రోజ్ స్పాట్స్) ఏర్పడతాయి. నాలుగు రోజులు ట్రీట్ మెంట్ చేస్తే తగ్గిపోతుంది. రెండు వారాలపాటు మందులు వాడాలి.

మూడు రోజుల్లో మలేరియా మాయం

ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరం అనే వైరస్ వల్ల మలేరియా వస్తుంది. మలేరియాకు మూడు రోజులు, అయిదు రోజుల కోర్సు ఉంది. ఈ మందులు వేసుకుంటే ఈజీగా తగ్గు తుంది. రోగ తీవ్రత కారణాలను బట్టి మూడు రోజులు అయిన రోజులు కోర్సు వాడాలి. 

స్వైన్ ఫ్లూ వస్తే.. రెండో రోజు. మూడో రోజు జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, తలనొప్పి పెరుగుతాయి. నెమ్మదిగా ఆయాసం వస్తుంది. మామూలు జ్వరానికి నాలుగైదు రోజులకు లంగ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ స్వైన్ ఫ్లూ వస్తే మాత్రం రెండో రోజే లంగ్ ఇన్ఫెక్ట్ అవుతుంది.

డెంగ్యూ ఫీవర్​..

డెంగ్యూ ఫీవర్​ ఏడిస్​ అనే జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమల్లో డెంగ్యూ వైరస్​ లు  ఉంటాయి. దోమ కుట్టినప్పుడు ఇవి రక్తంలోకి చేరతాయి. తీవ్రమైన జ్వరం. కీళ్ల నొప్పులు ఉంటాయి. డెంగ్యూకి కారణమైన ఏడిస్ దోమ ఎక్కువగా పగటి వేళల్లోనే కుడుతుంది. పగలు దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. డెంగ్యూ జ్వరం వల్ల రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. చిగుర్లు, కండరాల్లో రక్తస్రావం అవుతుంది. దెబ్బతగిలితే రక్తస్రావం ఆగిపోవడం ఆలస్యం అవుతుంది. ప్లేట్ లెట్స్ పడిపోతే రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. ఈ దోమలు కుట్టకుండా ఉండాలంటే ఇంటికి దగ్గర్లో నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు లేకుండా చేయాలి. ఏసీలు, కూలర్లు, పాత టైర్లు, డస్ట్ బిన్లు ఈ దోమలకు అడ్డాలు. అవి లేకుండా చూసుకోవాలి.

రెస్పిరేటరీ సిన్సిషియల్​ వైరస్​ : పిల్లలకు వచ్చే జ్వరాల్లో ఇదే ఎక్కువ. ఇది ఊపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పసి పిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు.
లక్షణాలు:  జ్వరం... ముక్కు వెంట నీరు కారడం .... గొంతునొప్పి ....తలనొప్పి (తీవ్రత తక్కువగా ఉంటుంది.)

రైనో వైరస్ : ఈ వైరస్ వల్ల జ్వరంతోపాటు ఇతర సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ మంది ఈ జ్వరంతోనే బాధపడుతుంటారు. 
లక్షణాలు : తుమ్ములు... లో జ్వరం.... తలనొప్పి..... గొంతునొప్పి.....  దగ్గు.... కండరాల నొప్పులు .... ఆకలి లేకపోవడం

స్వైన్​ ఫ్య్లూ:  ఇన్​ ఫ్య్లుయెంజా  వైరస్ ల వల్ల వచ్చే జ్వరాన్ని స్వైన్​ ఫ్య్లూఅంటారు. ఈ వైరస్​ లు నాలుగు రకాలు.  హెచ్1 ఎస్1, హెచ్ 1ఎన్2 ,హెచ్3 ఎస్​ 1,హెచ్3 ఎస్​ 2.  కె వీటిలో హెచ్1 ఎన్1 వైరస్ వల్లనే ఎక్కువ మందికి స్వైన్ ఫ్లూ సోకుతోంది.

లక్షణాలు : జ్వరం....  ఒళ్లునొప్పులు.... దగ్గు.... తలనొప్పి... గొంతునొప్పి... అలసట

జ్వరానికి పండ్ల రసాలే మందు

కొన్ని వైరస్ లు నీళ్లు, ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి ప్రాణాలు తీసేవేమీ కాదు. నీళ్లు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి జీర్ణ సంబంధమైన సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కడుపులో నొప్పి, నీళ్ల విరేచ నాలు, వాంతులు, తలనొప్పి వస్తాయి. కొందరిలో దగ్గు కూడా ఉంటుంది. ఈ సమస్యలేవీ ప్రమాదం కాకున్నా బాడీ డీ హైడీషన్ (శరీరం నుంచి నీరు బయ టిడిపోవడం) వల్ల బీపీ తగ్గిపోవడం వల్ల ప్రాణాంతకంగా మారొచ్చు. ఇలాంటి జ్వరాలు వస్తే ఓఆర్ ఎస్ నీళ్లు, పండ్ల రసాలు, జావలాంటివి తీసుకుంటే ఏమీ కాదు, డీహైడ్రేషన్ మెయింటెయిన్ చేస్తే త్వరగా కోలుకుంటారు. వాంతులు, విరోచనాలు రెండో రోజు తగ్గకపోతే హాస్పిటల్​ కు పోవాలి.