టీచర్ పోస్టుకు అప్లై చేసుకోండి

గరిడేపల్లి, వెలుగు : మండలంలోని గడ్డిపల్లి మోడల్ స్కూల్ లో స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవర్ లీ బేస్డ్ కింద కామర్స్ చెప్పేందుకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డి.నాగరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఎం.కామ్ తోపాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 25న గడ్డిపల్లి మోడల్ స్కూల్ కు సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.