ఆర్టీసీ బస్సు ఢీకొని పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి

కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి చెందారు.  కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సంఘటనాస్థలంలోనే హెడ్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

ప్రధానోపాద్యాయురాలు సత్తెవ్వ.. వేములవాడ మండలంలోని శాత్రాజ్ పల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొంది. డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.